Shreyas Iyer: గతం గురించి ఆలోచించడం లేదు.. జట్టులోకి తిరిగి వచ్చినందుకు సంతోషంగా ఉన్నా

వెన్ను గాయం కారణంగా కొంతకాలంగా జట్టుకు దూరమైన శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer).. ఆసియా కప్‌తో మళ్లీ బరిలోకి దిగనున్నాడు. ఆసియా కప్‌ కోసం సిద్ధమవుతున్న శ్రేయస్‌.. బీసీసీఐ చేసిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు. శస్త్రచికిత్స చేయించుకోవడానికి ముందు గాయం వల్ల ఎదురైన ఇబ్బందుల గురించి వివరించాడు. 

Published : 28 Aug 2023 02:03 IST

ఇంటర్నెట్ డెస్క్: వెన్ను గాయం కారణంగా కొంతకాలంగా జట్టుకు దూరమైన శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer).. ఆసియా కప్‌తో మళ్లీ బరిలోకి దిగనున్నాడు. ఆసియా కప్‌ కోసం ప్రకటించిన భారత జట్టులో అతడికి చోటుదక్కింది. ఈ టోర్నీలో రాణిస్తేనే ప్రపంచకప్‌ జట్టులో అతడికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఆసియా కప్‌ కోసం సిద్ధమవుతున్న శ్రేయస్‌.. బీసీసీఐ చేసిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు. శస్త్రచికిత్స చేయించుకోవడానికి ముందు గాయం వల్ల ఎదురైన ఇబ్బందుల గురించి వివరించాడు.

ఏమిటీ యోయో?.. భారత క్రికెట్లో మళ్లీ ఫిట్‌నెస్‌ పరీక్షపై చర్చ

‘‘వెన్నులో నరాలు పట్టేయడంతో తీవ్రమైన నొప్పి కలిగేది. ఏం చేస్తున్నాననే విషయాన్ని కూడా సరిగ్గా వ్యక్తపరచలేకపోయాను. దీని గురించి అందరికీ చెప్పడం కష్టం. నాకు కొంతకాలంగా ఈ సమస్య ఉంది. ఇంజెక్షన్లు తీసుకుని కొన్ని రోజులు వేచి చూశా. అలానే చాలా మ్యాచ్‌లు ఆడా. ఈ సమస్యకు పరిష్కారం లభించాలంటే శస్త్రచికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకున్నా. శస్త్రచికిత్స చేసిన అనంతరం సర్జన్‌ కూడా నేను తీసుకున్న నిర్ణయం సరైందేనని చెప్పాడు. ఆపరేషన్‌ తర్వాత 3 వారాల పాటు లండన్‌లో ఉన్నాను. నా పురోగతిని తెలుసుకోవడం కోసం ఆస్పత్రిలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఎన్‌సీఏలో మొదటి రన్నింగ్‌ సెషన్‌లో చాలా ఇబ్బందిపడ్డా. గతంలో ఏం జరిగిందనే దాని గురించి నేను ఆలోచించడం లేదు. కోలుకుని జట్టులోకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నా’’ అని శ్రేయస్ అయ్యర్ పేర్కొన్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని