T20 World Cup - Ind vs Pak: భారత్ - పాక్‌ పోరుకు ఉగ్రముప్పు.. స్పందించిన ఐసీసీ

టీ20 ప్రపంచకప్‌లో అత్యంత ఆసక్తికరమైన మ్యాచుల్లో దాయాదుల పోరు ఒకటి. అయితే, ఈ మ్యాచ్‌కు ఉగ్రవాదుల నుంచి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని వార్తలు వస్తున్నాయి.

Updated : 30 May 2024 16:26 IST

ఇంటర్నెట్ డెస్క్: జూన్ 9.. క్రికెట్ అభిమానులు ఎదురు చూసే రోజు. న్యూయార్క్‌ వేదికగా టీ20 ప్రపంచ కప్‌లో(T20 World Cup 2024) భారత్ - పాకిస్థాన్ (IND vs PAK) మ్యాచ్‌ అప్పుడే జరగనుంది. అయితే ఆ మ్యాచ్‌కు ఉగ్రముప్పు ఉందనే వార్తలు అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. ఇలాంటి రూమర్స్‌పై ఐసీసీ, న్యూయార్క్‌ గవర్నర్ ఆఫీస్‌ స్పందించింది. ప్రజా భద్రతకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేదని.. ప్రశాంతంగా మ్యాచ్‌లను నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. న్యూయార్క్‌ జూన్ 3 నుంచి 12 వరకు తొమ్మిది మ్యాచులకు ఆతిథ్యం ఇవ్వనుంది. 

‘‘న్యూయార్క్‌ స్టేట్ పోలీస్‌కు ఇప్పటికే అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చాం. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి భద్రతను కట్టుదిట్టం చేయాలని చెప్పాం. ప్రజల భద్రతే మా ప్రథమ ప్రాధాన్యం. వరల్డ్ కప్‌ మ్యాచ్‌లను అందరూ ఆస్వాదించేలా నిర్వహించేందుకు కట్టుబడి ఉన్నాం’’ అని న్యూయార్క్‌ గవర్నర్‌ కాతీ హోచుల్ వెల్లడించారు. 

అందులో ఎలాంటి మినహాయింపు లేదు: ఐసీసీ

‘‘ఈ మెగా టోర్నీని సురక్షితంగా నిర్వహించేందుకు మేం కూడా కఠిన చర్యలు తీసుకున్నాం. ప్రతి ఒక్కరి భద్రతే మాకు ముఖ్యం. దాని కోసం వివిధ అంచెల్లో సెక్యూరిటీని నియమించాం. ఆ రాష్ట్ర అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాం. ఏ చిన్న ఇబ్బంది ఎదురైనా తక్షణమే సరిదిద్దేందుకు సిద్ధంగా ఉంటాం’’ అని ఐసీసీ ప్రతినిధులు పేర్కొన్నారు. భారత్‌ జూన్ 5న ఐర్లాండ్‌తో తొలి మ్యాచ్‌ ఆడనుంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని