Cricket News: టెస్టు ర్యాంకింగ్స్‌లో యశస్వి జోరు.. ఐదో టెస్టుకు ఇంగ్లాండ్ తుది జట్టు ప్రకటన

భారత యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్‌-10లోకి దూసుకొచ్చాడు. భారత్‌తో ఐదో టెస్టు కోసం ఇంగ్లాండ్ తుది జట్టుని ప్రకటించింది.

Published : 06 Mar 2024 18:55 IST

ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న అయిదు టెస్టుల సిరీస్‌ (IND vs ENG)లో టీమ్‌ఇండియా యువ బ్యాటర్‌ యశస్వి జైస్వాల్‌ (Yashasvi Jaiswal) అదరగొడుతున్నాడు. ఇప్పటివరకు జరిగిన నాలుగు టెస్టుల్లో 655 పరుగులు సాధించాడు. ఈ క్రమంలోనే యశస్వి తొలిసారిగా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్‌-10లోకి దూసుకొచ్చాడు. అతడు రెండు స్థానాలు ఎగబాకి 10వ స్థానంలో నిలిచాడు. విరాట్ కోహ్లీ ఓ స్థానం మెరుగుపర్చుకుని ఎనిమిదో స్థానాన్ని దక్కించుకున్నాడు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ రెండు స్థానాలు మెరుగై 11వ స్థానంలో నిలిచాడు. న్యూజిలాండ్ ఆటగాడు కేన్‌ విలియమ్సన్‌ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ రెండు, స్టీవ్‌ స్మిత్ (ఆస్ట్రేలియా) మూడు స్థానాల్లో ఉన్నారు.


ఐదో టెస్టుకు ఇంగ్లాండ్‌ తుది జట్టు

భారత్, ఇంగ్లాండ్‌ మధ్య ధర్మశాల వేదికగా మార్చి 7 నుంచి అయిదో టెస్టు (చివరి) మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌ కోసం ఇంగ్లాండ్ తుది జట్టును ప్రకటించింది. పేసర్ మార్క్‌ వుడ్ తిరిగి ప్లేయింగ్‌ ఎలెవన్‌లో చోటు దక్కించుకున్నాడు. ఓలీ రాబిన్సన్ స్థానంలో వుడ్ జట్టులోకి వచ్చాడు. రాంచీలో జరిగిన నాలుగో టెస్టులో రాబిన్సన్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 58 పరుగులు చేశాడు. కానీ, ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. దీంతో అతడిని పక్కనపెట్టి మార్క్‌వుడ్ ను తుది జట్టులోకి తీసుకున్నారు.

ఇంగ్లాండ్ తుది జట్టు

జాక్‌ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్‌, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్‌ స్టోక్స్‌ (కెప్టెన్‌), బెన్‌ ఫోక్స్‌, టామ్ హార్ట్‌లీ, మార్క్‌వుడ్, జేమ్స్‌ అండర్సన్‌, షోయబ్‌ బషీర్.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని