India vs South Africa: గెలుపు దూరంలో.. కలల కప్పు

Eenadu icon
By Sports News Desk Updated : 02 Nov 2025 06:58 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

దక్షిణాఫ్రికాతో భారత్‌ ఫైనల్‌ నేడు

ఎన్నో ఆశలు.. ఎన్నో అంచనాలు. భారత క్రికెట్‌ అభిమానుల చూపంతా అటువైపే. దశాబ్దాల నిరీక్షణకు తెరపడడానికి.. కప్పు కల సాకారం కావడానికి భారత మహిళలకు కావాల్సింది ఇంకొక్క విజయమే. ఆదివారమే వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ నేతృత్వంలోని భారత్‌.. తొలి ట్రోఫీ కోసం ఆరాటపడుతోన్న దక్షిణాఫ్రికాను ఢీకొట్టనుంది. సంచలన బ్యాటింగ్‌తో ప్రపంచ రికార్డు లక్ష్యాన్ని ఛేదిస్తూ, మేటి జట్టు ఆస్ట్రేలియాను సెమీఫైనల్లో మట్టికరిపించిన భారత్‌.. రెట్టించిన ఉత్సాహంతో సమరానికి సిద్ధమైంది. గతంలో రెండు సార్లు అందినట్లే అంది చేజారిన కప్పును ఈసారైనా ఒడిసి పట్టాలన్నది ఆ జట్టు పట్టుదల. 2005, 2017లో భారత్‌ తుది సమరంలో భంగపడింది. విజేతగా నిలవడానికి ఆ జట్టుకు ఇదో గొప్ప అవకాశమనడంలో సందేహం లేదు. క్రికెట్‌ చరిత్రలో అత్యంత బలమైన జట్లయిన ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లలో ఒక్కటి కూడా లేకుండా జరుగుతున్న తొలి ప్రపంచకప్‌ ఫైనల్‌ ఇదే కావడం విశేషం. అంటే మనం కొత్త ప్రపంచ ఛాంపియన్‌ను చూడబోతున్నామన్న మాట. ఫైనల్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశముంది. మ్యాచ్‌కు రిజర్వ్‌ డే ఉంది.

Tags :
Published : 02 Nov 2025 06:57 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని