IND vs ENG: ఇంగ్లాండ్‌పై విక్టరీ.. డబ్ల్యూటీసీ టేబుల్‌లో దూసుకొచ్చిన భారత్

ఇంగ్లాండ్‌పై (IND vs ENG) రెండో టెస్టులో విజయం సాధించిన భారత్ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ముందుకువచ్చింది.

Published : 05 Feb 2024 17:28 IST

ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లాండ్‌పై విజయం సాధించిన భారత్‌ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (WTC 2023-25) పాయింట్ల పట్టికలో దూసుకొచ్చింది. ఈ మ్యాచ్‌ ముందు డబ్ల్యూటీసీ పట్టికలో ఆరో స్థానంలో ఉన్న టీమ్‌ఇండియా.. ఇప్పుడు ఏకంగా రెండో ప్లేస్‌కు వచ్చేసింది. ప్రస్తుతం 52.77 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. అగ్రస్థానంలో ఆస్ట్రేలియా (55 శాతం) కొనసాగుతోంది. ఈ రెండు జట్ల తర్వాత దక్షిణాఫ్రికా (50), న్యూజిలాండ్ (50), బంగ్లాదేశ్‌ (50) ఉన్నాయి. ఇంగ్లాండ్‌ టీమ్‌ (25 శాతం) ఎనిమిదో స్థానానికి పడిపోయింది. 

బజ్‌బాల్‌ క్రికెట్‌తో కొన్ని విజయాలను మాత్రమే సాధించిన ఇంగ్లాండ్‌.. ఎక్కువగా ఓటములనే చవిచూస్తోంది. వచ్చే ఏడాది మార్చి నాటికి పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు ఫైనల్‌లో తలపడతాయి. రెండో టెస్టులో ఇంగ్లాండ్‌ను ఓడించడంలో భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (209) డబుల్‌ సెంచరీతోపాటు పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా (9/91) కీలక పాత్ర పోషించారు. గిల్ (104) కూడా సెంచరీతో అలరించాడు. ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌గా బుమ్రా నిలిచాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని