IPL 2024: ఫుడ్ నచ్చలేదన్న హార్దిక్‌.. సిబ్బందిపై పంత్‌ సీరియస్‌: ఐపీఎల్‌ యాడ్ వీడియోలు లీక్‌

IPL 2024: ఐపీఎల్‌ 2024 యాడ్ షూట్‌కు సంబంధించిన కొన్ని వీడియోలు లీక్‌ అయ్యాయి. ప్రస్తుతం అవి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Updated : 24 Feb 2024 15:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మరో నెల రోజుల్లో ఐపీఎల్‌ (IPL 2024) సందడి ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే టోర్నీ ప్రచారం కోసం యాడ్ షూట్‌ (Ad Shoot) చేశారు. పలు జట్ల కెప్టెన్లు, కీలక ఆటగాళ్లు ఇందులో నటించారు. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు నెట్టింట లీక్ అయ్యాయి. అందులో ముంబయి కొత్త సారథి హార్దిక్‌ పాండ్య, దిల్లీ ఆటగాడు రిషభ్‌ పంత్ సహా కొందరు ఆటగాళ్లు షూట్‌ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా ఉంది.

షూట్‌ మధ్యలో లంచ్‌ కోసం ఢోక్లా, జిలేబీని వడ్డించగా హార్దిక్‌ అసహనానికి గురయ్యాడు. ‘‘ఇదేంటీ? నేను ఫిట్‌నెస్‌ చూసుకోవాలి. వీటిని ఎలా తినగలను?ఇలా నేను సర్దుకోలేను. మీ డైరెక్టర్‌కు చెప్పండి. ఇలా ఉంటే పని జరగదు’’ అంటూ సిబ్బందిపై మండిపడటం వీడియోలో కన్పించింది.

పంత్‌.. తొలి అర్ధభాగంలో బ్యాటర్‌గానే..

ఇక, మరో వీడియోలో రిషభ్‌ పంత్‌ కూడా అసహనానికి గురైనట్లుగా ఉంది. ‘‘ఏడుపు రాకుండా ఎలా ఏడవాలయ్యా..? డైరెక్టర్‌ను పిలవండి. స్క్రిప్ట్‌ మార్చండి’’ అని అన్నాడు. వీరితో పాటు శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌ పాల్గొన్న యాడ్‌ వీడియోలు కూడా లీక్‌ అయ్యాయి. ధోతీ నచ్చలేదని అయ్యర్‌, స్క్రిప్ట్‌ను ఎలా గుర్తు పెట్టుకోవాలని రాహుల్ ఆగ్రహించినట్లుగా వాటిల్లో ఉంది.

ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. అయితే ప్రచారం కోసమే వీటిని లీక్ చేశారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మార్చి 22 నుంచి ఐపీఎల్‌ 17వ సీజన్‌ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని