IPL 2024:: ఐపీఎల్ 2024.. రెండు మ్యాచ్‌లను రీషెడ్యూల్ చేసిన బీసీసీఐ

ఐపీఎల్ 17 సీజన్‌లో రెండు మ్యాచ్‌లను బీసీసీఐ రీషెడ్యూల్ చేసింది. ఆ మ్యాచ్‌లు ఏంటంటే.. 

Published : 02 Apr 2024 16:48 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్‌లో రెండు మ్యాచ్‌లను బీసీసీఐ రీ షెడ్యూల్ చేసింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం కోల్‌కతా, రాజస్థాన్‌ల మధ్య మ్యాచ్‌ ఈనెల 17న ఈడెన్‌ గార్డెన్స్‌లో జరగాల్సిఉంది. కానీ, అదేరోజు శ్రీరామనవమి ఉండటంతో మ్యాచ్‌కు కావాల్సినంత భద్రత కల్పించలేమని బెంగాల్‌ క్రికెట్‌ సంఘం (క్యాబ్‌)కు పోలీసులు తెలియజేశారు. దీంతో ఈ మ్యాచ్‌ను ఒకరోజు ముందు (ఏప్రిల్ 16న) నిర్వహించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. అదేవిధంగా అహ్మదాబాద్‌ వేదికగా ఏప్రిల్ 16న గుజరాత్, దిల్లీ మధ్య జరగాల్సిన మ్యాచ్‌ను మరుసటి రోజు (ఏప్రిల్ 17న) నిర్వహిస్తామని పేర్కొంటూ ఈమేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని