Ishan Kishan: ‘బజ్‌బాల్’ క్రికెట్‌పై ఇషాన్‌ కిషన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!

విండీస్‌తో టెస్టు సిరీస్‌ను (WI vs IND) యువ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్‌ సద్వినియోగం చేసుకున్నారు. యశస్వి నిలకడగా భారీ సెంచరీ సాధించగా.. ఇషాన్ దూకుడుగా ఆడి హాఫ్ సెంచరీ చేశాడు.

Updated : 25 Jul 2023 17:02 IST

ఇంటర్నెట్ డెస్క్: వెస్టిండీస్‌పై రెండో టెస్టులో (WI vs IND) భారత బ్యాటర్లు దూకుడుగా ఆడేశారు. కేవలం 24 ఓవర్లలోనే 181/2 స్కోరు సాధించారు. ఇందులో ఇషాన్ కిషన్‌ (52*) వేగవంతమైన హాఫ్ సెంచరీ సాధించాడు. అలాగే టెస్టు చరిత్రలో 74 బంతుల్లోనే వంద పరుగులు చేసిన జట్టుగా భారత్‌ రికార్డు సృష్టించింది. ఈ క్రమంలో ఇంగ్లాండ్‌ తరహా ‘బజ్‌బాల్’ క్రికెట్‌ను టీమ్‌ఇండియా కూడా అలవాటు చేసుకుందా..? అనే చర్చ మొదలైంది. అది బజ్‌బాల్ కాదు.. ద్రవ్‌బాల్ (కోచ్ ద్రవిడ్ పేరు మీద) అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇదే విషయంపై ఇషాన్‌ కిషన్‌ (Ishan Kishan) కూడా స్పందించాడు. 

‘‘టెస్టు క్రికెట్‌లో ప్రతిసారి ఫాస్ట్‌గా ఆడాల్సిన అవసరం లేదు. పరిస్థితిని బట్టి వేగంగా పరుగులు సాధించాలి. పిచ్‌ ఎలా స్పందిస్తుందనేది కూడా చాలా కీలకం. విండీస్‌ పిచ్‌లు (WI vs IND) కఠినంగా ఉంటాయి. ఇక్కడ క్రీజ్‌లో నిలదొక్కుకుంటేనే పరుగులు సాధించే అవకాశాలు ఉంటాయి. బౌన్స్, టర్న్ అవుతాయి. అందుకే పిచ్‌ను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. టీమ్‌ఇండియాలో ఇలా ఆడే ప్లేయర్లు చాలా మంది ఉన్నారు. ప్రతి ఫార్మాట్‌లోనూ ఎలా ఆడాలి..? వారి పాత్ర ఏంటి? అనేదానిపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉంది. అందుకే, ప్రతి మ్యాచ్‌లోనూ వేగంగా పరుగులు చేయాలని చూడకూడదు. ఆ పరిస్థితికి అనుగుణంగా ఆడాలి. 

టీమ్‌ఇండియా ‘డబ్ల్యూటీసీ’ పాయింట్లపైనా వరుణుడి దెబ్బ!

కెప్టెన్ రోహిత్ శర్మకు (Rohit Sharma) యువ క్రికెటర్లను ఎలా ట్రీట్ చేయాలో బాగా తెలుసు. వారి నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టేందుకు ప్రయత్నిస్తాడు. మరింత స్వేచ్ఛను ఇచ్చి ప్రోత్సహించడం అతడి స్పెషాలిటీ. అనవసరంగా ఒత్తిడి పెట్టకుండా మనం సౌకర్యంగా ఉండేలా చూస్తాడు. నేను రెండో ఇన్నింగ్స్‌లో నాలుగో స్థానంలో ఆడినప్పుడు కూడా ‘నీదైన ఆటతీరును ప్రదర్శించు. ఒత్తిడికి గురి కావద్దు’ అని చెప్పాడు. ఇలా కెప్టెన్‌ మన మీద భరోసా ఉంచినప్పుడు యువ క్రికెటర్‌గా ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్‌ చేసేందుకు అవకాశం ఉంటుంది’’ అని ఇషాన్‌ వివరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని