IND vs ENG: ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టు.. భారత జట్టు ఇదే

ఇంగ్లాండ్‌తో శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న నాలుగో టెస్టుకు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది.

Updated : 21 Feb 2024 09:30 IST

రాంచీ: ఇంగ్లాండ్‌తో శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న నాలుగో టెస్టుకు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. టీమ్‌లో స్వల్ప మార్పులు చేసింది. ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాకు విశ్రాంతినిచ్చింది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో బుమ్రా అత్యధికంగా 17 వికెట్లు తీశాడు. రెండో టెస్టులో ఒంటి చేత్తో జట్టును విజయ తీరాలకు చేర్చిన విషయం తెలిసిందే. అతడికి విశ్రాంతినివ్వాలనే ఉద్దేశంతోనే ఈ టెస్టుకు దూరంగా ఉంచినట్లు బీసీసీఐ వెల్లడించింది. మరోవైపు గాయం కారణంగా రెండు, మూడు టెస్టులకు దూరమైన కేఎల్‌ రాహుల్‌ ఈ మ్యాచ్‌ కూడా ఆడటం లేదు. ‘‘ రాహుల్‌ నాలుగో మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఫిట్‌గా ఉంటే చివరి మ్యాచ్‌ ఆడతాడు’’ అని బీసీసీఐ ప్రకటనలో పేర్కొంది. మూడో టెస్టుకు దూరంగా ఉన్న ముకేశ్‌ కుమార్‌ ఈసారి జట్టులో స్థానం దక్కించుకున్నాడు. రాంచీ వేదికగా శుక్రవారం నుంచి నాలుగో టెస్టు ప్రారంభం కానుంది.

జట్టు ఇదే: రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), యశస్వి జైస్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌, రజత్‌ పటీదార్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్‌), కేఎస్‌ భరత్‌ (వికెట్‌ కీపర్‌), దేవ్‌దత్‌ పడిక్కల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్‌, ముకేశ్‌ కుమార్‌, ఆకాశ్‌ దీప్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని