Bengaluru vs Kolkata: బెంగళూరుకు షాక్‌.. వరుసగా రెండో విజయం సాధించిన కోల్‌కతా

కోల్‌కతా వరుసగా రెండో విజయం సాధించింది. బెంగళూరుతో జరిగిన పోరులో 7 వికెట్ల తేడాతో ఆ జట్టు నెగ్గింది.   

Updated : 29 Mar 2024 22:58 IST

బెంగళూరు: ఐపీఎల్‌ 2024లో భాగంగా కోల్‌కతా వరుసగా రెండో విజయం సాధించింది. బెంగళూరుతో జరిగిన పోరులో ఆ జట్టు 7 వికెట్ల తేడాతో నెగ్గింది. 183 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా 16.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వెంకటేశ్‌ అయ్యర్‌ (50) అర్ధశతకం చేయగా, సునీల్‌ నరైన్‌ (47), ఫిలిప్‌ సాల్ట్‌ (30), శ్రేయస్‌ అయ్యర్‌(39*) రాణించారు. బెంగళూరు బౌలర్లలో యశ్‌ దయాల్‌, మయాంక్‌ దగర్‌, విజయ్‌కుమార్‌ ఒక్కో వికెట్‌ తీశారు. 

అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఓపెనర్‌ విరాట్‌ కోహ్లీ (83: 59 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) నాటౌట్‌గా నిలిచి బెంగళూరు భారీ స్కోర్‌ చేయడంతో కీలకంగా వ్యవహరించాడు. గ్రీన్‌ (33), మాక్స్‌వెల్‌ (28), దినేశ్‌ కార్తిక్‌ (20) విరాట్‌కు సహకరించారు. కోల్‌కతా బౌలర్లలో రాణా, రస్సెల్‌ తలో రెండు వికెట్లు తీశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని