Ishant Sharma-Virat Kohli : ‘భాయ్‌.. నీ సైజుకు తగ్గ షార్ట్స్‌ కొనుక్కో’ : ఇషాంత్‌తో కోహ్లీ సరదా ఘటన..

పరుగుల వీరుడు విరాట్‌ కోహ్లీ(Virat Kohli) అందరితో చాలా సరదాగా ఉంటాడన్న విషయం తెలిసిందే.  కోహ్లీని తొలిసారి కలిసినప్పుడు జరిగిన ఓ ఫన్నీ మూమెంట్‌ను ఇషాంత్‌ శర్మ(Ishant Sharma) గుర్తు చేసుకున్నాడు.

Published : 25 Jun 2023 18:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : టీమ్‌ఇండియాలో విరాట్‌ కోహ్లీ(Virat Kohli), ఇషాంత్‌ శర్మ(Ishant Sharma) క్లోజ్‌ ఫ్రెండ్స్‌ అన్న సంగతి తెలిసిందే. క్రికెట్‌ ఆడే తొలినాళ్ల నుంచే వీరు మంచి స్నేహితులు. ఇద్దరు కలిసి అండర్‌-17కు ఆడారు. దిల్లీ జట్టుకు, టీమ్‌ఇండియా(Team India)కూ ప్రాతినిధ్యం వహించారు.  విరాట్‌ను తాను మొదటిసారి కలిసినప్పటి సరదా సంగతులను ఇషాంత్‌ తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పంచుకున్నాడు.

‘నేను తొలిసారి కోహ్లీని అండర్‌-17 ట్రయల్స్‌లో కలిశాను. అప్పుడు నేను చిన్న షార్ట్స్‌ వేసుకున్నట్లు గుర్తు. విరాట్‌ అప్పటికే అండర్‌-19కు ఆడి ఉండటంతో అతడి పేరు చాలా మందికి తెలుసు. అతడిని విరు అని పిలుస్తుండేవారు. మా మధ్య మ్యాచ్‌ పశ్చిమ దిల్లీ క్రికెట్‌ అకాడమీలో జరిగింది. నా బౌలింగ్‌లో అతడు దంచికొట్టాడు. అది పూర్తిగా ఫ్లాట్‌ పిచ్‌’’

‘‘చివరికి నేను ఏదో విధంగా అండర్‌-17 ట్రయల్స్‌కు ఎంపికయ్యాను. వ్యక్తిగతంగా కోహ్లీని కలిశాను. చిన్న షార్ట్స్‌లో ఉన్న నన్ను చూసి అతడు వెంటనే..‘భాయ్‌.. నీ సైజుకు తగ్గ షార్ట్స్‌ కొనుక్కో’ అంటూ సరదాగా అన్నాడు. నేను ఆ వయసులో చాలా సిగ్గు పడేవాడిని. ఇతరులతో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. దిల్లీ U-17కు ఆడటమంటే ఎంత పెద్ద విషయమో నాకు తెలియదు. ‘కనీసం రంజీ ట్రోఫీలోనైనా ఆడు.. ప్రభుత్వ ఉద్యోగమైనా దొరుకుతుంది’ అని మా నాన్న నాకు ఎప్పుడూ చెబుతుండేవాడు. ఆ తర్వాత నేను టీమ్‌ఇండియాకు ఆడతానని అప్పుడూ ఎవరూ ఊహించి ఉండరు’ అంటూ ఆనాటి ఘటనను గుర్తు చేసుకున్నాడు ఇషాంత్‌.

ఇక ఇషాంత్‌ శర్మ టీమ్‌ఇండియాకు ఆడి చాలా కాలమైన విషయం తెలిసిందే. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌(IPL 2023)లో దిల్లీ(delhi capitals) జట్టు తరఫున పలు మ్యాచ్‌లు ఆడాడు ఈ పేసర్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని