lucknow super giants: కొత్త జెర్సీతో లఖ్‌నవూ.. కారణమిదే..

కోల్‌కతాతో మ్యాచ్‌లో లఖ్‌నవూ కొత్త జెర్సీతో బరిలోకి దిగింది. గతేడాది కూడా ఆ జట్టుతో ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లోనూ ఇలానే విభిన్న జెర్సీతో ఆడింది.

Updated : 14 Apr 2024 16:51 IST

కోల్‌కతా: లఖ్‌నవూతో మ్యాచ్‌లో కోల్‌కతా టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో లఖ్‌నవూ జెర్సీ మారింది. కోల్‌కతాకు చెందిన మోహన్‌ బగాన్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌కు ట్రిబ్యూట్‌ ఇచ్చేలా గ్రీన్‌, మెరూన్‌ కలర్‌ జెర్సీలో ఆటగాళ్లు బరిలోకి దిగారు. గత సీజన్‌లోనూ కోల్‌కతాతో ఆడినప్పుడు ఇదే జెర్సీలో లఖ్‌నవూ ఆటగాళ్లు కనిపించారు. ఈ సీజన్‌లో ఈ ఇరు జట్లు తాము ఆడిన చివరి మ్యాచ్‌ల్లో ఓటమిపాలయ్యాయి. దీంతో ఈ మ్యాచ్‌లో విజయం రెండు జట్లకు కీలకం కానుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని