Messi tour in Hyderabad: హైదరాబాద్‌ రానున్న మెస్సి..!

Eenadu icon
By Sports News Team Published : 02 Nov 2025 00:26 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: అర్జెంటీనా ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనెల్‌ మెస్సి (Lionel Messi) త్వరలో హైదరాబాద్‌కు రానున్నారు. డిసెంబర్‌లో భారత్‌లో పర్యటించనున్న (GOAT Tour to India 2025) ఆయన.. దేశంలోని ప్రధాన నగరాల్లో సందడి చేయనున్నారు. దక్షిణాదిన తొలుత కేరళలో పర్యటించాలని అనుకున్నప్పటికీ ఆ వేదిక రద్దు కావడంతో లియోనెల్‌ మెస్సి కార్యక్రమాన్ని హైదరాబాద్‌కు మార్చాలని నిర్వాహకులు నిర్ణయించారు. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు.

భారత్‌ పర్యటనలో భాగంగా కోల్‌కతా, హైదరాబాద్‌, ముంబయి, దిల్లీ నగరాల్లో మెస్సి సందడి చేయనున్నారు. దక్షిణాదిలో ఉన్న లక్షలాది మంది ఫుట్‌బాల్‌ అభిమానుల కోసం హైదరాబాద్‌లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు భారత్‌లో మెస్సి పర్యటన (GOAT) నిర్వహకుడు సతాద్రు దత్తా వెల్లడించారు. వారం రోజుల్లో బుకింగ్‌లు ప్రారంభమవుతాయన్నారు. అయితే, వేదిక మాత్రం గచ్చిబౌలి లేదా రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో ఉంటుందన్నారు.

కలల కప్పు..చిక్కేనా మూడోసారైనా?

డిసెంబర్‌ 12- 13 అర్ధరాత్రి లేదా తెల్లవారుజామున లియోనెల్‌ మెస్సి కోల్‌కతా చేరుకుంటారు. సాల్ట్‌ లేక్‌ స్టేడియం ఏర్పాటు చేసే కార్యక్రమంలో పాల్గొంటారు. అదే రోజు (డిసెంబర్‌ 13) సాయంత్రం హైదరాబాద్‌ చేరుకుంటారు. డిసెంబర్‌ 14న ముంబయి, డిసెంబర్‌ 15న దిల్లీలో పర్యటిస్తారు. ఆ రోజు ప్రధాని మోదీతోనూ భేటీ కానున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు