Mohammed Shami: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు 9 కేజీలు తగ్గిన షమీ!

ఇంటర్నెట్ డెస్క్: ఐసీసీ ట్రోఫీ అంటే భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ (Shami) చెలరేగిపోతాడు. దాదాపు 14 నెలల తర్వాత ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టిన షమీ.. ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy 2025) తొలి మ్యాచ్‌లోనే ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. బంగ్లాదేశ్‌పై 5/53 గణాంకాలను నమోదు చేసిన షమీ వన్డే, ఛాంపియన్స్ ట్రోఫీల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు. అయితే, ఈ టోర్నీకి ముందు ఫిట్‌నెస్ సాధించేందుకు తీవ్రంగా కష్టపడ్డాడు. దాదాపు 9 కేజీల వరకు బరువు తగ్గినట్లు షమీ తెలిపాడు. ఆ వీడియోను బీసీసీఐ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. గాయం నుంచి కోలుకునేందుకు జాతీయ క్రికెట్ అకాడమీలో చాన్నాళ్లు సమయం గడిపానని.. దేశవాళీ క్రికెట్‌లో ఆడటం వల్ల బౌలింగ్‌లో రిథమ్‌ను అందుకోవడం సులువైందని షమీ వెల్లడించాడు. భారత మాజీ క్రికెటర్ నవ్‌జ్యోత్ సిద్ధూతో షమీ చిట్‌చాట్ నిర్వహించాడు.
సిద్ధూ: హాయ్ షమీ.. నువ్వు ఎలా ఐదారు కేజీలు బరువు తగ్గావు?
షమీ: నేను 9 కేజీలు తగ్గా.
సిద్ధూ: అస్సలు అన్నమే తినలేదా? బిర్యానీ కూడా తినలేదా?
షమీ: గాయం నుంచి కోలుకుని వచ్చేందుకు చాలా శ్రమించా. నేను ఎన్‌సీఏకు వెళ్లినప్పుడు దాదాపు 90 కేజీల వరకు ఉన్నా. నేనెప్పుడూ రుచి కోసం తినాలనుకోను. అలాగే ఎక్కువగా స్వీట్లు తినను. అలాంటి వాటికి చాలా దూరంగా ఉంటా. ఇక బిర్యానీ విషయంలోనే కొంత ఆందోళన ఉండేది. అప్పుడప్పుడు చేసే చీట్‌మీల్‌తో పెద్ద సమస్య ఉండేది కాదు. నేను 2015 నుంచి రోజుకు ఒక్క పూటే తింటున్నా. బ్రేక్‌ఫాస్ట్, లంచ్ చేయను. నేరుగా డిన్నర్ చేస్తా. ఇది మొదట్లో కష్టంగా అనిపించినా.. అలవాటైతే ఈజీ అయిపోతుంది
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

చిన్నారితో అసభ్య ప్రవర్తన.. హైదరాబాద్‌లో డ్యాన్స్ మాస్టర్ అరెస్టు
 - 
                        
                            

తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ విధానంపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు
 - 
                        
                            

బిహార్ అసెంబ్లీ పోరు.. ముగిసిన తొలిదశ ప్రచారం
 - 
                        
                            

విద్యార్థులతో కాళ్లు నొక్కించుకున్న టీచర్ సస్పెండ్
 - 
                        
                            

రోడ్డెక్కిన సీఎం.. ‘ఎస్ఐఆర్’కు వ్యతిరేకంగా నిరసనలు
 - 
                        
                            

ఛత్తీస్‌గఢ్‌లో రెండు రైళ్లు ఢీ.. పలువురు మృతి
 


