Mohammed Shami: ధారాళంగా పరుగులిచ్చిన మహ్మద్‌ షమీ

Eenadu icon
By Sports News Team Published : 29 Aug 2025 19:33 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా (Team India) సీనియర్‌ బౌలర్‌ మహ్మద్‌ షమీ (Mohammed Shami) పునరాగమనంలో తేలిపోయాడు. బ్యాటర్లకు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. దులీప్‌ ట్రోఫీ 2025లో భాగంగా క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ఈస్ట్‌ జోన్‌- నార్త్‌ జోన్‌ తలపడుతున్నాయి. ఈ పోరులో షమీ ఈస్ట్‌ జోన్‌ తరఫున బరిలోకి దిగుతున్నాడు. రెడ్‌ బాల్‌ క్రికెట్‌లో అతడు దాదాపు తొమ్మిదినెలల తర్వాత పునరాగమనం చేశాడు. కానీ, బౌలింగ్‌లో పెద్దగా రాణించలేదు. కేవలం ఒక్క వికెట్‌ మాత్రమే తీసుకోగలిగాడు. 

మహ్మద్‌ షమీ 23 ఓవర్లపాటు బౌలింగ్‌ వేసి 4.35 ఎకానమీతో 100 పరుగులు సమర్పించుకున్నాడు. షాహిల్‌ లోత్రా వికెట్‌ మాత్రమే పడగొట్టాడు. అయితే మనీషి అద్భుతంగా బౌలింగ్‌ వేసి అయిదు వికెట్ల ప్రదర్శన చేశాడు. 22.2 ఓవర్లపాటు బౌలింగ్‌ వేసిన అతడు 111 పరుగులిచ్చి 6 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. సూరజ్‌ సింధు జైస్వాల్ 15 ఓవర్లు బౌలింగ్‌ వేసి 44 పరుగులిచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన నార్త్‌ జోన్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో 405 పరుగులకు ఆలౌటైంది. తర్వాత బ్యాటింగ్‌ ప్రారంభించిన ఈస్ట్‌ జోన్‌ 230 పరుగులకే కుప్పకూలింది. 

షమీ చివరిసారిగా రెడ్‌ బాల్‌ క్రికెట్‌ గత రంజీ సీజన్‌లో ఆడాడు. అప్పుడు అతడు రెండు ఇన్నింగ్స్‌ల్లో ఏడు వికెట్లు కూల్చాడు.  షమీ చివరిగా టీమ్ఇండియా తరఫున వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌ షిప్‌ (ICC World Test Championship) 2023 ఫైనల్‌ మ్యాచ్‌లో కనిపించాడు. ఫిట్‌నెస్‌ సమస్యల వల్ల షమీని ఇంగ్లాండ్‌ టూర్‌కు కూడా ఎంపిక చేయలేదు. ఆసియా కప్‌ (Asia cup) నేపథ్యంలో 15 మంది సభ్యులతో తాజాగా ప్రకటించిన టీమ్‌ఇండియా స్క్వాడ్‌లోనూ అతడు స్థానం దక్కించుకోలేకపోయాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు