Mumbai vs Lucknow: లఖ్‌నవూతో మ్యాచ్‌.. టాస్‌ గెలిచిన ముంబయి.. జట్లు ఇవే!

ఐపీఎల్‌ 17వ సీజన్‌లో భాగంగా వాంఖడే వేదికగా మరికాసేపట్లో ముంబయి, లఖ్‌నవూ మధ్య మ్యాచ్‌ జరగనుంది.

Updated : 17 May 2024 19:23 IST

ముంబయి: ఐపీఎల్‌ 17వ సీజన్‌లో భాగంగా వాంఖడే వేదికగా ముంబయి, లఖ్‌నవూ మధ్య మ్యాచ్‌ జరగనుంది. టాస్‌ గెలిచిన ముంబయి బౌలింగ్‌ ఎంచుకొని లఖ్‌నవూని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. లఖ్‌నవూ ఆడిన 13 మ్యాచుల్లో 6 గెలిచి 12 పాయింట్లతో పట్టికలో ఏడో స్థానంలో ఉంది. ఇవాళ్టి మ్యాచ్‌లో భారీ విజయాన్ని అందుకొని, ఇతర జట్ల ఫలితాలూ సానుకూలంగా వస్తే తప్ప ప్లేఆఫ్స్‌ చేరే అవకాశం లేదు. ఇది దాదాపు అసాధ్యమేనని చెప్పాలి.

మరోవైపు ముంబయి పాయింట్ల పట్టికలో చిట్టచివర నిలిచి ప్లేఆఫ్స్‌ రేసు నుంచి ఇప్పటికే నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి గౌరవప్రదంగా లీగ్‌ ముగించాలని చూస్తోంది. సచిన్‌ తెందూల్కర్‌ కుమారుడు అర్జున్‌ తెందూల్కర్‌ ముంబయి తుది జట్టులో స్థానం దక్కించుకున్నాడు.


జట్ల వివరాలు:

లఖ్‌నవూ: కేఎల్‌ రాహుల్‌ (కెప్టెన్‌), దేవదత్‌ పడిక్కల్‌, మార్కస్‌ స్టాయినిస్‌, దీపక్‌ హుడా, నికోలస్‌ పూరన్‌, ఆయుష్‌ బదోనీ, కృనాల్‌ పాండ్య, అర్షద్‌ ఖాన్‌, మ్యాట్‌ హెన్రీ, రవి బిష్ణోయ్‌, మోషిన్‌ ఖాన్‌

ఇంపాక్ట్‌ ప్లేయర్స్‌: నవీన్‌ ఉల్‌ హక్‌, అష్టన్‌ టర్నర్‌, మణిమారన్‌ సిద్ధార్థ్‌, ప్రేరక్‌ మన్కడ్‌, కృష్ణప్ప గౌతమ్‌

ముంబయి: ఇషాన్‌ కిషన్‌, నమన్‌ ధిర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, డెవాల్డ్‌ బ్రెవిస్‌, హార్దిక్‌ పాండ్య (కెప్టెన్‌), నేహల్‌ వధేరా, రొమారియో షెపర్డ్‌, అన్షుల్‌ కంబోజ్‌, పీయుష్‌ చావ్లా, అర్జున్‌ తెందూల్కర్‌, నువాన్‌ తుషార

ఇంపాక్ట్‌ ప్లేయర్స్‌: రోహిత్‌ శర్మ, టిమ్‌ డేవిడ్‌, శామ్స్‌ ములానీ, ఆకాశ్‌ మధ్వా, కుమార్‌ కార్తికేయ


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని