Yash Dayal: యశ్‌ దయాల్‌పై ‘ట్రాష్‌’ కామెంట్లు.. మాజీ క్రికెటర్‌పై విమర్శలు

Yash Dayal: బెంగళూరు ఆటగాడు యశ్‌ దయాల్‌ను ‘ట్రాష్‌’ అంటూ మాజీ క్రికెటర్‌ మురళీ కార్తిక్‌ చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి. దీనికి బెంగళూరు ఫ్రాంచైజీ గట్టిగా బదులిచ్చింది.

Updated : 26 Mar 2024 11:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐపీఎల్‌ తాజా సీజన్‌లో బెంగళూరు తొలి విజయాన్ని నమోదు చేసింది. అద్భుత ప్రదర్శనతో తొలుత బౌలర్లు పంజాబ్‌ను కట్టడి చేయగా.. ఆ తర్వాత కోహ్లి చెలరేగి జట్టును గెలిపించాడు. అయితే, ఈ మ్యాచ్‌ సందర్భంగా భారత మాజీ క్రికెటర్‌ మురళీ కార్తిక్‌ (Murali Kartik) చేసిన వ్యాఖ్యలపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

నిన్నటి మ్యాచ్‌లో బెంగళూరు పేసర్‌ యశ్‌ దయాల్‌ (Yash Dayal) బౌలింగ్‌ చేస్తుండగా మురళీ కార్తిక్‌ మాట్లాడుతూ.. ‘‘మనం ఎప్పుడూ చెప్పినట్లే.. ఒకరికి పనికిరానిది (ట్రాష్‌) మరొకరికి విలువైన నిధిగా మారుతుంది’’ అని అన్నాడు. దీంతో ఈ కామెంట్లపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ అంశంపై బెంగళూరు ఫ్రాంచైజీ సోషల్‌ మీడియా వేదికగా స్పందిస్తూ.. ‘ఇతడు మా విలువైన నిధి’ అంటూ లవ్‌ ఎమోజీని జత చేసింది.

టీ20 ప్రమోషన్‌కు ఇంకా నా పేరే.. వారికి స్పష్టమైన సమాధానమిచ్చిన కోహ్లి!

గతేడాది జరిగిన ఐపీఎల్‌ టోర్నీలో యశ్‌ దయాల్‌ గుజరాత్‌కు ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. ఆ సీజన్‌లో కోల్‌కతాతో మ్యాచ్‌ సందర్భంగా ఈ ఎడమచేతి వాటం పేసర్‌ బౌలింగ్‌లో రింకూ సింగ్‌ వరుసగా ఐదు సిక్స్‌లు బాది జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. దీంతో దయాల్‌ను గుజరాత్‌ పక్కనబెట్టింది. ఆ సీజన్‌లో కేవలం ఐదు మ్యాచ్‌లు ఆడిన అతడు రెండు వికెట్లు తీశాడు.

అయినప్పటికీ వేలంలో బెంగళూరు అతడిని రూ.5 కోట్లు వెచ్చించి తీసుకుంది. ఇందుకు తగ్గట్టుగానే తాజా సీజన్‌లో దయాల్‌ ఫర్వాలేదనిపిస్తున్నాడు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లకు 23 పరుగులు ఇచ్చి ప్రత్యర్థి జట్టును కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఒక వికెట్‌ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని