PSL: మ్యాచ్‌ జరుగుతుండగా డ్రెస్సింగ్‌ రూమ్‌లో సిగరెట్ తాగిన క్రికెటర్

పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ (PSL)లోని ఇస్లామాబాద్‌ యునైటెడ్‌ ఆల్‌రౌండర్‌ ఇమాద్‌ వసీమ్ వివాదంలో చిక్కుకున్నాడు. 

Updated : 19 Mar 2024 12:11 IST

ఇంటర్నెట్ డెస్క్: పాక్‌ ఆల్‌రౌండర్‌ ఇమాద్‌ వసీమ్‌ (Imad Wasim) వివాదంలో చిక్కుకున్నాడు. పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ (PSL)లో ఇస్లామాబాద్‌ యునైటెడ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అతడు.. సోమవారం ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతుండగా టీమ్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌లో సిగరెట్ తాగుతూ కెమెరాకు చిక్కాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీనిని చూసిన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘పాకిస్థాన్‌ ‘స్మోకింగ్‌’ లీగ్’’ అని ఎక్స్‌ (x)లో ఓ నెటిజన్‌ కామెంట్ చేశాడు. వసీమ్‌పై పాక్‌ క్రికెట్‌ బోర్డు ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.  

అయితే, ఫైనల్‌ మ్యాచ్‌లో మాత్రం వసీమ్ అదరగొట్టాడు. నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి 23 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. దీంతో ముల్తాన్‌ సుల్తాన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులే చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు ఇస్లామాబాద్‌ జట్టు చెమటోడ్చింది. చివరి బంతికి విజయం సాధించి మూడోసారి పీఎస్‌ఎల్ టైటిల్‌ను అందుకుంది. ఇమాద్‌ వసీమ్‌ ‘ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని