షాట్లు ఆడేందుకు జంకుతున్న పుజారా

ఆస్ట్రేలియాపై దాడి చేయడానికి బదులు షాట్లు ఆడేందుకు చెతేశ్వర్‌ పుజారా జంకుతున్నాడని ఆసీస్‌ మాజీ దిగ్గజం అలన్‌ బోర్డర్‌ విమర్శించాడు. మూడో రోజు టీమ్ఇండియా బ్యాటింగ్‌ వ్యూహాలు బాగాలేవని విమర్శించాడు. రికీ పాంటింగ్‌ సైతం ఆయన అభిప్రాయంతో ఏకీభవించగా టామ్‌మూడీ మాత్రం విభేదించాడు...

Updated : 09 Jan 2021 22:34 IST

సిడ్నీ: ఆస్ట్రేలియాపై దాడి చేయడానికి బదులు షాట్లు ఆడేందుకు చెతేశ్వర్‌ పుజారా జంకుతున్నాడని ఆసీస్‌ మాజీ దిగ్గజం అలన్‌ బోర్డర్‌ విమర్శించాడు. మూడో రోజు టీమ్ఇండియా బ్యాటింగ్‌ వ్యూహాలు బాగాలేవని విమర్శించాడు. రికీ పాంటింగ్‌ సైతం ఆయన అభిప్రాయంతో ఏకీభవించగా టామ్‌మూడీ మాత్రం విభేదించాడు. పుజారా తన సహజ ఆటతీరును అనుసరిస్తున్నాడని స్కోరుబోర్డు వేగం పెంచాల్సిన బాధ్యత అజింక్య రహానె, హనుమ విహారిపై ఉందని వెల్లడించాడు.

మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పుజారా 176 బంతుల్లో 50 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. అతడి బ్యాటింగ్‌ ప్రభావం టీమ్‌ఇండియాపై పడిందని ఆసీస్‌ మాజీలు అంటున్నారు. ‘పుజారా షాట్లు ఆడేందుకు భయపడుతున్నాడు. పరుగులు చేయకుండా వికెట్‌ కాపాడుకొనేందుకే చూస్తున్నాడు. గత సిరీసు మాదిరిగా ఈసారి అతడు ప్రభావం చూపలేకపోతున్నాడు. పరుగులు చేసేందుకు సుదీర్ఘ సమయం తీసుకుంటున్నాడు. పుజారా క్రీజులోనే ఉండిపోవడం టీమ్‌ఇండియా బ్యాటింగ్‌పై వ్యతిరేక ప్రభావం చూపింది. ఆసీస్‌ బౌలింగ్‌పై వారు ఆధిపత్యం చూపించలేకపోయారు’ అని బోర్డర్‌ అన్నాడు.

పుజారా స్కోరు వేగం పెంచేందుకు మరికాస్త దూకుడుగా ఆడాలని రికీ పాంటింగ్ ‌అంటున్నాడు. అతడి బ్యాటింగ్‌ ప్రభావం మిగతా ఆటగాళ్ల బ్యాటింగ్‌పై పడుతోందని విమర్శించారు. టామ్‌మూడీ మాత్రం నయావాల్‌కు అండగా నిలిచాడు. ‘ఇందులో పుజారా తప్పేమీ లేదు. అతడు తన బ్రాండు టెస్టు క్రికెట్‌ ఆడుతున్నాడు. తన సహజ శైలికి భిన్నంగా ఆడాలనడం సరికాదు. స్కోరు వేగం పెంచాల్సిన బాధ్యత రహానె, విహారిపై ఉందని అంటాను. వీరిద్దరూ ఆటను ముందుకు తీసుకెళ్లాలి’ అని మూడీ పేర్కొన్నాడు.

ఇవీ చదవండి
నయావాల్‌.. డీకోడెడ్‌!
మహ్మద్‌ సిరాజ్‌పై జాత్యహంకార వ్యాఖ్యలు!

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని