Rajasthan vs Kolkata: రాజస్థాన్‌ను ముంచిన వరుణుడు.. హైదరాబాద్‌ను వరించిన అదృష్టం

ఐపీఎల్ 17వ సీజన్‌లో కీలక సమయంలో హైదరాబాద్‌కు అదృష్టం కలిసొచ్చింది. నేడు రాజస్థాన్‌, కోల్‌కతా మధ్య జరగాల్సిన చివరి లీగ్ మ్యాచ్‌ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది.

Updated : 19 May 2024 23:08 IST

గువాహటి: ఐపీఎల్ 17వ సీజన్‌లో కీలక సమయంలో హైదరాబాద్‌కు అదృష్టం కలిసొచ్చింది. నేడు రాజస్థాన్‌, కోల్‌కతా మధ్య జరగాల్సిన చివరి లీగ్ మ్యాచ్‌ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. మ్యాచ్‌ ప్రారంభానికి ముందు నుంచే గువాహటిలో వర్షం కురిసింది. ఎట్టకేలకు 10 గంటల తర్వాత వర్షం తగ్గడంతో మ్యాచ్‌ నిర్వహణకు వీలుగా మైదానాన్ని సిద్ధం చేసి 7 ఓవర్ల ఆటను నిర్వహించాలనుకున్నారు. కోల్‌కతా టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. 10:45 గంటలకు ప్రారంభించాలనుకున్నారు. కానీ, అంతలోనే వరుణుడు మరోసారి ఆటంకం కలిగించాడు. దీంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

కోల్‌కతాపై విజయం సాధించి క్వాలిఫయర్‌-1కు అర్హత సాధించాలనుకున్న రాజస్థాన్‌ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లినట్లయింది. మ్యాచ్‌ రద్దవడంతో ఇరుజట్లకు చెరో పాయింట్ కేటాయించారు. రాజస్థాన్‌, హైదరాబాద్‌ 17 పాయింట్లతో సమానంగా ఉన్నప్పటికీ మెరుగైన రన్‌రేట్‌తో సన్‌రైజర్స్‌ రెండో స్థానాన్ని పదిలం చేసుకుంది. మే 21న అహ్మదాబాద్‌లో కోల్‌కతా, హైదరాబాద్‌ జట్ల మధ్య క్వాలిఫయర్‌-1 జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు దూసుకెళ్తుంది. ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది. బుధవారం రాజస్థాన్‌తో ఆర్సీబీ ఎలిమినేటర్ మ్యాచ్‌లో తలపడనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని