Ashwin: టీమ్‌ఇండియాకు షాక్‌.. మూడో టెస్టు నుంచి వైదొలిగిన అశ్విన్‌

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌ నుంచి అశ్విన్‌ దూరమయ్యాడు.   

Updated : 17 Feb 2024 09:47 IST

రాజ్‌కోట్‌: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌ (India vs England) నుంచి భారత బౌలర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ (Ravichandran Ashwin) వైదొలిగాడు. కుటుంబంలో తలెత్తిన మెడికల్‌ ఎమర్జెన్సీ కారణంగా అశ్విన్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ (BCCI) ‘ఎక్స్‌’(ట్విటర్‌)లో వెల్లడించింది. ఇటువంటి పరిస్థితుల్లో అతడికి జట్టుతో పాటు బోర్డు అండగా నిలుస్తుందని తెలిపింది. రాజ్‌కోట్‌ (RajKot) వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అశ్విన్‌ (Ashwin) శుక్రవారం ఒక వికెట్‌ తీసి 500 వికెట్ల క్లబ్‌లో చేరిన విషయం తెలిసిందే. భారత్‌ టెస్టు క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన రెండో బౌలర్‌గా ఘనతకెక్కాడు. మూడో టెస్టులో అశ్విన్‌ 37 పరుగులు చేసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు.

తన తల్లి అనారోగ్యంతో బాధపడుతుండడంతోనే అశ్విన్‌ మ్యాచ్‌ నుంచి దూరమైనట్లు సమాచారం. ఈ మేరకు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా పోస్టు చేశారు. ఈ పరిస్థితుల్లో తన తల్లికి దగ్గర ఉండడం కోసం అశ్విన్‌ రాజ్‌కోట్‌ నుంచి చెన్నై వెళ్లినట్లు పేర్కొన్నారు. ఆమె తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇలాంటి పరిస్థితుల్లో మీడియా, అభిమానులు అశ్విన్‌, అతడి కుటుంబ సభ్యుల గొప్యతకు భంగం కలిగించకుండా ఉండాలని బీసీసీఐ బోర్డు పేర్కొంది. ఆటగాళ్లు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం, శ్రేయస్సు తమకు ఎంతో ముఖ్యమని తెలిపింది. ఈ కష్టకాలంలో అశ్విన్‌కు అవసరమైన సహాయాన్ని బోర్డు, టీమ్‌ఇండియా జట్టు అందిస్తుందని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని