IPL - RCB: ఆర్సీబీ నయా జెర్సీ.. జట్టు పేరులో మార్పు

ఆర్సీబీ జట్టు తన పేరులో చిన్న మార్పు చేసింది. ఇప్పటివరకు ఆంగ్లంలో ‘Royal Challengers Bangalore’ అని రాస్తోంది. దీన్ని ‘Royal Challengers Bengaluru’గా మార్చింది.

Published : 20 Mar 2024 00:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నెట్టింట చక్కర్లు కొడుతోన్న వార్తలను నిజం చేస్తూ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB) జట్టు తన పేరులో చిన్న మార్పు చేసింది. ప్రస్తుతం ఆర్సీబీ తమ జట్టు పేరును ఆంగ్లంలో ‘Royal Challengers Bangalore’ అని రాస్తోంది. ఇప్పుడు అందులో స్వల్ప మార్పులు చేసి ‘Royal Challengers Bengaluru’గా మార్చింది. ‘మేం ఇష్టపడే నగరం.. గర్వంగా అందిపుచ్చుకునే వారసత్వం.. ఇది మా సరికొత్త అధ్యాయం. మీ జట్టు.. మీ ఆర్సీబీ’’ అంటూ ట్వీట్‌ చేసింది. స్థానిక అభిమానుల కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ అన్‌బాక్స్‌ ఈవెంట్‌ నిర్వహిస్తోన్న వేళ ఈ ప్రకటన వచ్చింది.

కోహ్లీ కొత్త హెయిర్‌స్టైల్‌ అదుర్స్‌.. ఫొటోలు వైరల్

కొత్త జెర్సీ ధరించిన జట్టు సభ్యులతో కూడిన ఫొటోనూ ఆర్సీబీ ‘ఎక్స్‌’లో షేర్‌ చేసింది. మేమంతా నూతన ‘కవచం’తో సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. ఐపీఎల్‌ (IPL)లో భారీ అభిమానగణం ఉన్న జట్లలో ఆర్సీబీ ఒకటి. స్టార్‌ ఆటగాళ్లతో కళకళలాడే ఈ జట్టు తనదైన రోజు ఎంతటి బలమైన టీమ్‌నైనా చిత్తుగా ఓడించగలదు. అయితే.. లీగ్‌ దశలో బాగా ఆడి కీలకమైన ప్లేఆఫ్స్‌లో చేతులెత్తేస్తూ అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. ఇప్పటివరకు మూడుసార్లు ఫైనల్‌కు వెళ్లి రన్నరప్‌గా సరిపెట్టుకుంది. ఈసారైనా టైటిల్‌ కల నెరవేరాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. మార్చి 22న సీఎస్కే, ఆర్సీబీ మధ్య జరిగే మ్యాచ్‌తో ఐపీఎల్‌-2024 సీజన్‌ ప్రారంభం కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని