Sachin Tendulkar: మొదటి సెంచరీ ఎక్కడ చేశానో చాలామందికి తెలియదు: సచిన్ తెందూల్కర్

Eenadu icon
By Sports News Team Updated : 20 Dec 2024 12:21 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్ డెస్క్: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్‌ (Sachin Tendulkar) బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా గ్లోబర్‌ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితుడయ్యాడు. ఈ సందర్భంగా ముంబయిలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సచిన్.. అండర్‌-15 రోజులను, బరోడాతో తనకున్న బంధాన్ని గుర్తుచేసుకున్నాడు. ‘‘ఏ అధికారిక టోర్నమెంట్‌లోనైనా, ఏ వయసులోనైనా నేను ముంబయి తరఫున సాధించిన మొదటి సెంచరీ బరోడాలో చేశానని ఇక్కడున్న చాలా మందికి తెలియదు. 1986లో నేను తొలి సెంచరీ నమోదు చేశాను. అండర్‌-15 టోర్నమెంట్‌లో మహారాష్ట్ర తరఫున ఆడి 123 పరుగులు చేశా. 

అది అక్కడితో ఆగలేదు. ఆ తర్వాత ముంబయి రంజీ జట్టుకు ఎంపికయ్యా. అప్పుడు ప్రాబబుల్స్‌లో ఉన్నా. అయితే, తుది జట్టులో చోటు దక్కలేదు. కానీ యాదృచ్ఛికంగా ఆ మ్యాచ్ కూడా బరోడాలోనే జరిగింది. ఆ సమయంలో మీ ఫౌండర్‌ (సయాజీరావు గైక్వాడ్ III, బరోడా మహారాజు) ప్యాలెస్‌ని సందర్శించే అవకాశం నాకు లభించింది. బరోడా మాజీ ప్లేయర్ సమర్‌జిత్ గైక్వాడ్‌తో కలిసి ఆడా. ఇలా బరోడాతో నాకు ఎంతో అనుబంధం ఉంది. నా 400వ వన్డే మ్యాచ్ కూడా బరోడాలోనే ఆడాననుకుంటా’’ అని సచిన్ గుర్తు చేసుకున్నాడు. మాస్టర్‌ బ్లాస్టర్ తన సుదీర్ఘ కెరీర్‌లో 200 టెస్టులు, 463 వన్డేలు, ఒక టీ20 మ్యాచ్‌ ఆడాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 34,357 పరుగులు చేశాడు.

Tags :
Published : 07 Oct 2024 21:41 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు