Sunrisers Hyderabad: బౌలింగ్‌లో పాట్ కమిన్స్ అదరగొట్టాడు: సంజయ్ బంగర్

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ (IPL) 2025 సీజన్‌లో భాగంగా మంగళవారం దిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals), సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) తలపడ్డాయి. వర్షం కారణంగా పూర్తి మ్యాచ్ జరగలేదు. దీంతో హైదరాబాద్ బ్యాటింగ్ చేయలేకపోయింది. వరుణుడి రాకతో మ్యాచ్ రద్దు కావడంతో సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో షమీ (Mohammed Shami) గైర్హాజరీతో పాట్ కమిన్స్ (Pat Cummins) బౌలింగ్ ప్రారంభించాల్సి వచ్చింది. కమిన్స్ వరుసగా మూడు ఓవర్లలో మూడు వికెట్లు కూల్చి అద్భుతంగా రాణించాడు. ఈ విషయమై టీమ్‌ఇండియా(Team India) మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ (sanjay bangar) తన అభిప్రాయం వ్యక్తం చేశాడు.
‘షమీ బదులుగా పాట్ కమిన్స్ కొత్తబంతితో బౌలింగ్ చేయడం సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు అద్భుతంగా కలిసి వచ్చింది. నిజానికి షమీ ప్రత్యర్థులను హడలెత్తిస్తాడు అని కమిన్స్ అతడి మీద నమ్మకం పెట్టుకున్నాడు. కానీ ఈ మ్యాచ్‌లో అతడు అవతలి జట్టును షమీ కన్నా, పాట్ కమిన్సే ఎక్కువ భయపెట్టాడు. వరుసగా మూడు ఓవర్లలో మూడు వికెట్లు తీసి, దిల్లీ క్యాపిటల్స్‌ను హడలెత్తించాడు. నిజానికి పాట్ కమిన్స్ బంతిని స్వింగ్ చేయాలని అస్సలు చూడలేదు. రైట్ ఏరియాస్‌లో వరుసగా బంతులు సంధించాడు’ అని సంజయ్ బంగర్ విశ్లేషించాడు.
అలాగే ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ టీమ్ ప్రదర్శనపై కూడా అతడు మాట్లాడాడు. ‘ఈ సీజన్‌ను హైదరాబాద్ ఘనంగానే ప్రారంభించింది. మొదటి మ్యాచ్‌లో వారు 280 పైచిలుకు పరుగులు చేశారు. గత సీజన్‌లోని వీరబాదుడును కొనసాగించబోతున్నాం... అని సంకేతమిచ్చారు. కానీ ప్రతిసారీ వీరబాదుడు ఫార్ములా వర్కౌట్ కాదు. బ్యాటర్లు ఫామ్‌లో ఉన్నప్పుడు ఈ ఫీట్ బాగుంటుంది. కానీ ఎప్పుడైతే వారు ఫామ్‌లో ఉండరో... అప్పుడు మొదటికే మోసం వస్తుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు విషయంలో ప్రస్తుతానికి ఇదే జరిగింది’ అని సంజయ్ బంగర్ విశ్లేషించాడు.
నిరుడు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ వీరవిహారంతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన హైదరాబాద్... ఈ సీజన్‌లో చతికిలపడింది. అలాగే బౌలింగ్‌లో షమీ ప్రదర్శన పేలవంగా ఉంది. తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన మహ్మద్ షమీ కేవలం 6 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. ఈ విషయంలో పాట్‌కమిన్సే 13 వికెట్లతో మెరుగ్గా ఉన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

చిన్నారితో అసభ్య ప్రవర్తన.. హైదరాబాద్‌లో డ్యాన్స్ మాస్టర్ అరెస్టు
 - 
                        
                            

తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ విధానంపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు
 - 
                        
                            

బిహార్ అసెంబ్లీ పోరు.. ముగిసిన తొలిదశ ప్రచారం
 - 
                        
                            

విద్యార్థులతో కాళ్లు నొక్కించుకున్న టీచర్ సస్పెండ్
 - 
                        
                            

రోడ్డెక్కిన సీఎం.. ‘ఎస్ఐఆర్’కు వ్యతిరేకంగా నిరసనలు
 - 
                        
                            

ఛత్తీస్‌గఢ్‌లో రెండు రైళ్లు ఢీ.. పలువురు మృతి
 


