Shami - Team India: పునరాగమనం కోసం తహతహ.. షమీని మళ్లీ చూడగలమా?
టీమ్‌ఇండియాకు దూరంగా సీనియర్ పేసర్.. పట్టించుకోని సెలక్టర్లు

భారత క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ పేస్ బౌలర్లలో ఒకడు మహ్మద్ షమీ. చాలా ఏళ్ల పాటు మూడు ఫార్మాట్లలో జట్టుకు కీలక బౌలర్‌గా ఉన్నాడు. ముఖ్యంగా టెస్టులు, వన్డేల్లో అతడికి గొప్ప రికార్డు ఉంది. దిగ్గజాల జాబితాలో నిలిచే స్థాయి ఉన్న ఈ బౌలర్.. టీమ్‌ఇండియాకు క్రమక్రమంగా దూరం అయిపోతున్నాడు. సెలక్టర్ల తీరు చూస్తుంటే.. షమీ మళ్లీ భారత జట్టుకు ఆడగలడా అన్న సందేహాలు కలుగుతున్నాయి.
2023 వన్డే ప్రపంచకప్ సందర్భంగా షమీ పేరు ఎంతగా మార్మోగిందో గుర్తుండే ఉంటుంది. సొంతగడ్డపై అప్రతిహత విజయాలతో భారత జట్టును ఫైనల్‌కు చేర్చడంలో షమీది అత్యంత కీలక పాత్ర. 24 వికెట్లతో ఆ టోర్నీలో అత్యుత్తమ బౌలర్‌గా నిలిచాడు షమీ. తన కెరీర్లో మరెన్నో ఉత్తమ ప్రదర్శనలు ఉన్నా.. ఆ ప్రపంచకప్‌లో షమీ బౌలింగ్ మెరుపులను అభిమానులు అంత సులువుగా మరిచిపోలేరు. కానీ అంత గొప్ప ప్రదర్శన తర్వాత షమీకి టీమ్‌ఇండియాలో ఇబ్బందికర పరిస్థితి తప్పలేదు. ప్రపంచకప్‌లో గాయంతో దాదాపు ఏడాది పాటు అతను మైదానానికి దూరంగా ఉన్నాడు. గత ఏడాది చివర్లో కోలుకొని ఆటలోకి వచ్చినా, భారత జట్టులో తిరిగి చోటు సంపాదించడం కష్టమైపోయింది. ఆస్ట్రేలియాతో సిరీస్‌కు షమీకి జట్టులో చోటివ్వలేదు సెలక్టర్లు. దేశవాళీల్లో ఆడి ఫిట్‌నెస్, ఫామ్‌ను చాటుకున్నా అతడికి అవకాశం దక్కలేదు. టెస్టుల్లో ఆడేంత పరిపూర్ణ ఫిట్‌నెస్ షమీకి లేదన్నట్లుగా మాట్లాడాయి జట్టు వర్గాలు. అప్పటి కెప్టెన్ రోహిత్ శర్మ సైతం ఇదే విషయం చెప్పాడు.
ఆపై ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌లో షమీని ఆడిస్తే ఆశించినంత ప్రదర్శన చేయలేదు. 3 మ్యాచ్‌ల్లో 3 వికెట్లే తీశాడు. తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలో తలపడే భారత వన్డే జట్టులో షమీకి ఛాన్స్ లభించింది. కానీ ఆ టోర్నీలోను షమీ అంచనాలను అందుకోలేకపోయాడు. బలహీన బంగ్లాదేశ్‌పై 5 వికెట్లు తీసినా.. మిగతా 4 మ్యాచ్‌ల్లో 4 వికెట్లే పడగొట్టాడు. పాకిస్థాన్ మీద ఒక్క వికెట్టూ తీయలేకపోయాడు. దీంతో ఈ టోర్నీ తర్వాత షమీని సెలక్టర్లు పూర్తిగా పక్కన పెట్టేశారు. ఇంగ్లాండ్ పర్యటనలో టెస్టు జట్టుకు ఎంపిక చేయలేదు. ఆసియా కప్ టీ20 టోర్నీలో ఆడించలేదు. ప్రస్తుత ఆస్ట్రేలియా సిరీస్‌లోనూ అతడికి ఛాన్సివ్వలేదు. వివిధ ఫార్మాట్లలో జట్టు ఎంపిక సందర్భంగా షమీ పేరును సెలక్టర్లు అసలు పరిగణనలోకే తీసుకోవట్లేదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. దీంతో అతని కెరీర్‌పై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.
మాటల దాడి

టీమ్‌ఇండియాకు షమీని ఎంపిక చేయకపోవడంపై ఇటీవల అతడికి, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌కు మధ్య పరోక్షంగా మాటల దాడి జరుగుతోంది. షమీ ఫిట్‌నెస్ మీద అగార్కర్ సందేహాలు వ్యక్తం చేస్తున్నాడు. టెస్టులు ఆడేంత పూర్తి ఫిట్‌నెస్ షమీలో లేదన్నట్లు అతను మాట్లాడాడు. దీనికి షమీ కూడా దీటుగానే బదులిచ్చాడు. తాను రంజీల్లో ఆడుతున్నానంటే ఫిట్‌గా ఉన్నట్లేనని.. ప్రతిసారీ తన ఫిట్‌నెస్ గురించి సెలక్టర్లకు ప్రత్యేకంగా సమాచారం ఇవ్వలేనని అతనన్నాడు. ఇన్నేళ్ల కెరీర్లో షమీ ఎప్పుడూ ఇలా సెలక్షన్ గురించి బహిరంగ వ్యాఖ్యలు చేసింది లేదు. తాజాగా షమీ రంజీల్లో సత్తా చాటాడు. 2 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు తీశాడు. అనంతరం అతను మాట్లాడుతూ.. టీమ్‌ఇండియాకు మళ్లీ ఆడాలని ఉందని.. రాణించడం వరకే తన పని అని, మిగతాదంతా సెలక్టర్ల చేతుల్లో ఉందని వ్యాఖ్యానించాడు. కానీ భవిష్యత్ ప్రణాళికల దృష్ట్యా సెలక్టర్లు షమీ వైపు చూడట్లేదనే చర్చ జరుగుతోంది.
35 ఏళ్ల షమీ, ఇప్పుడు ఉన్న ఫిట్‌నెస్‌తో టెస్టులు ఆడలేడన్నది సెలక్టర్ల అభిప్రాయంగా కనిపిస్తోంది. అతను టెస్టులాడి రెండేళ్లు దాటిపోవడం గమనార్హం. మరోవైపు వన్డేలు ఆడడమే తక్కువ. ఆస్ట్రేలియాకు అతన్ని ఎంపిక చేయలేదంటే.. 2027 ప్రపంచకప్ ప్రణాళికల్లో అతను లేడనే అనిపిస్తోంది. టీ20ల్లో షమీ ఆడడమే తక్కువ. పైగా ఈ ఏడాది ఐపీఎల్‌లో విఫలమయ్యాడు. వచ్చే ఏడాది పొట్టి ప్రపంచకప్ కోసం యువ బౌలర్లకే ఎక్కువగా అవకాశాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏ ఫార్మాట్లోనూ షమీకి పరిస్థితులు ఆశాజనకంగా కనిపించడం లేదు. వయసు, ఫిట్‌నెస్ అతడికి ప్రతికూలతలుగా మారాయి. ఈ నేపథ్యంలో షమీని మళ్లీ టీమ్‌ఇండియా జెర్సీలో చూసే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి.
- ఈనాడు క్రీడావిభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

కథానాయకి
మేటి క్రికెటర్లందరూ గొప్ప కెప్టెన్లు అవుతారనే గ్యారెంటీ లేదు. అందుకు చరిత్రలో ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. కానీ కొందరిని చూస్తే సహజ నాయకుల్లా కనిపిస్తారు. - 
                                    
                                        

కసి రేగెను.. కథ మారెను
నెల కిందట మహిళల వన్డే ప్రపంచకప్ ఆరంభమవుతున్నపుడు.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా లాంటి మేటి జట్లను వెనక్కి నెట్టి భారత మహిళల జట్టు విజేతగా నిలవగలదని అనుకున్నామా? - 
                                    
                                        

అంబరాన్ని అంటిన సంబరాలు
దక్షిణాఫ్రికాపై అద్భుత విజయంతో వన్డే ప్రపంచకప్ అందుకున్న భారత్.. ఆదివారం రాత్రంతా సంబరాలు చేసుకుంది. ‘‘మువ్వన్నెల జెండా.. ఉవ్వెత్తున ఎగిరింది. - 
                                    
                                        

కోట్ల రూపాయలు.. వజ్రాల హారాలు
చరిత్రాత్మక వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత మహిళల జట్టుపై నజరానాల వర్షం కురుస్తోంది. హర్మన్‌ప్రీత్ బృందానికి బీసీసీఐ రూ.51 కోట్ల నగదు బహుమతిని ప్రకటించింది. - 
                                    
                                        

ఈ 7 గంటలు మీవే కావాలి..
చక్‌దే ఇండియా సినిమా గుర్తుందా? భారత మహిళల హాకీ జట్టు కోచ్ కబీర్‌ఖాన్ (షారుక్ ఖాన్) ఫైనల్‌కు ముందు తన ప్లేయర్లలో ఎలాగైనా గెలవాలన్న కాంక్షను రగిలిస్తాడు. - 
                                    
                                        

పాపం.. ప్రతీక
ప్రతీక రావల్ ఈ ప్రపంచకప్‌లో భారత్ తరఫున రెండో అత్యధిక స్కోరర్. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉంది. - 
                                    
                                        

సంక్షిప్త వార్తలు(5)
భారత స్టార్ దివ్య దేశ్‌ముఖ్.. చెస్ ప్రపంచకప్‌లో ఓడిపోయింది. ఈ మహిళల ప్రపంచకప్ విజేత.. తొలి రౌండ్లో 0-2తో అర్డిటిస్ (గ్రీస్) చేతిలో పరాజయం చవిచూసింది. - 
                                    
                                        

అప్పట్లో.. నేల మీదే నిద్ర.. పప్పన్నమే పరమాన్నం!
ప్రపంచ మహిళల వన్డే వరల్డ్ కప్‌ను టీమ్‌ఇండియా (Team India) కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో భారత్‌లో మహిళల క్రికెట్ ప్రస్థానంపై చర్చ నడుస్తోంది. - 
                                    
                                        

గాలి వాటం కాదు.. డబ్ల్యూపీఎల్ వేసిన పీఠం ఇది!
నవీముంబయి స్టేడియంలో వెలుగులు విరజిమ్మే దీపకాంతుల మధ్య.. భారత మహిళల జట్టు (Team India) కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆఖరు క్యాచ్ అందుకుంది. దీంతో టీమ్‌ఇండియా చరిత్రలో తొలిసారిగా విశ్వవిజేతగా అవతరించింది. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

జేడీ వాన్స్ వ్యాఖ్యలు దేశంలో హిందూ వ్యతిరేకతను ఎగదోస్తున్నాయి: అమెరికన్ చట్టసభ సభ్యుడు
 - 
                        
                            

విశాఖలో స్వల్ప భూప్రకంపనలు
 - 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 - 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 


