MNREGA scandal: ‘ఉపాధి హామీ’ నిధుల మోసం.. షమీ సోదరి అత్తే సూత్రధారి..!

వృత్తంలో షమీ సోదరి షబీనా
ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా స్టార్ పేసర్ షమీ ప్రస్తుతం ఐపీఎల్ (IPL 2025) ఆడుతున్నాడు. కానీ, అతడి కుటుంబానికి చెందిన వార్తలతో హాట్ టాపిక్‌గా మారాడు. తన సోదరి పేరు ఉపాధి హామీ పథకం లబ్ధిదారుల జాబితాలో ఉండటమే దానికి కారణం. ఆమె భర్త కూడా కూలి డబ్బులను తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే, దీనింతటికీ షమీ సోదరి అత్త గులె ఆయేషానే కారణమని ప్రచారం సాగుతోంది. ఆమె ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోరా గ్రామ పెద్దగా వ్యవహరిస్తున్నారు. ఆయేషానే ముందుండి తన కుటుంబసభ్యుల పేర్లను జాతీయ ఉపాధి హామీ పథకం లబ్ధిదారుల జాబితాలో పొందుపరిచినట్లు ప్రాథమిక విచారణలోనూ తేలిందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే జిల్లా స్థాయి విచారణ జరుగుతోందని.. జాబితాలోని పేర్లను తొలగించినట్లు జిల్లా మెజిస్ట్రేట్ నిధి గుప్తా వెల్లడించారు. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
‘‘స్థానిక అధికారులతో కూడిన బృందం విచారణ చేస్తోంది. ఎలాంటి పని చేయకుండానే 18 మంది ఉపాధి పథకం ద్వారా వేతనాలు తీసుకున్నట్లు గుర్తించాం. అందులో షమీ సోదరి షబీనా, ఆమె భర్త ఘజ్నావి, అతడి సోదరులు ఆమిర్ సుహైల్, నస్రుద్దీన్, షేఖు ఉన్నారు. వీరితోపాటు గ్రామపెద్ద గులే ఆయేషా పేరు కూడా ఉంది. వారి కుమారులు, కుమార్తెలను ఇందులో చేర్చినట్లు తెలుస్తోంది’’ అని డీఎం నిధి గుప్తా తెలిపారు.
స్పందించని కుటుంబసభ్యులు
ఉపాధి హామీ పథకంలో 2021 నుంచి 2024 వరకు షమీ సోదరి కుటుంబసభ్యులు డబ్బులు తీసుకున్నారని కథనాలు పేర్కొన్నాయి. ఈ వార్తలపై షమీ గానీ, అతడి కుటుంబసభ్యుల నుంచి గానీ ఎలాంటి స్పందన రాలేదు. అయితే వాస్తవంగా వీరే తమ పేర్లు నమోదు చేసుకున్నారా, లేక ఇతరులు ఇలా చేసి మోసాలకు పాల్పడుతున్నారా అన్నది తొలుత తెలియరాలేదు. అయితే, విచారణ నేపథ్యంలో గ్రామపెద్దగా ఉన్న షమీ సోదరి అత్తే వీరి పేర్లను జత చేసి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

చిన్నారితో అసభ్య ప్రవర్తన.. హైదరాబాద్‌లో డ్యాన్స్ మాస్టర్ అరెస్టు
 - 
                        
                            

తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ విధానంపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు
 - 
                        
                            

బిహార్ అసెంబ్లీ పోరు.. ముగిసిన తొలిదశ ప్రచారం
 - 
                        
                            

విద్యార్థులతో కాళ్లు నొక్కించుకున్న టీచర్ సస్పెండ్
 - 
                        
                            

రోడ్డెక్కిన సీఎం.. ‘ఎస్ఐఆర్’కు వ్యతిరేకంగా నిరసనలు
 - 
                        
                            

ఛత్తీస్‌గఢ్‌లో రెండు రైళ్లు ఢీ.. పలువురు మృతి
 


