Women's World Cup: ఆ కోటను బద్దలు కొట్టేదెలా?
ఈనాడు క్రీడావిభాగం

అమ్మో ఆస్ట్రేలియా.. మహిళల ప్రపంచకప్ ఆరంభమవుతుండగా కంగారూ జట్టు గురించి అందరూ భయపడ్డారిలా! టోర్నీ మొదలయ్యాక.. ఇలా భయపడ్డంలో ఆశ్చర్యమేమీ లేదన్నట్లే సాగింది ఆ జట్టు ఆట. గ్రూప్ దశలో ఆ జట్టుకు ఓటమన్నదే లేదు. ఒక మ్యాచ్ వర్షం వల్ల రద్దు కాగా.. మిగతా ఆరు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించింది. టోర్నీలో అందరి కంటే ముందుగా సెమీస్ బెర్తును ఖరారు చేసుకున్నది ఆస్ట్రేలియానే. మొత్తంగా 13 పాయింట్లతో లీగ్ దశలో అగ్రస్థానం సాధించారు కంగారూ అమ్మాయిలు. అలాంటి జట్టు సెమీస్‌లో భారత్‌కు ఎదురవుతోంది. విజయం ఆషామాషీ విషయం కాదని వేరే చెప్పాలా?
ఈ ప్రపంచకప్ గ్రూప్ దశలో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తిరుగులేని బ్యాటింగ్ లైనప్ ఉన్న ఆసీస్.. ఈ మ్యాచ్‌లో పరుగుల వరద పారించేస్తుందని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా తడబడ్డ ఆ జట్టు 76/6కు చేరుకుంది. ఆసీస్ స్కోరు 150కి మించదని అంచనా. కానీ చివరికి 221/9తో ఇన్నింగ్స్‌ను ముగించింది. తర్వాత పాక్‌ను 114 పరుగులకే కుప్పకూల్చి 107 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఇక న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో ఒక దశలో 128/5కు పరిమితమై కూడా 326 పరుగులు చేసి, ఘనవిజయం సాధించడం.. మరో పోరులో 350 దాటేలా కనిపించిన భారత్‌ను 330కి కట్టడి చేసి, అంత పెద్ద లక్ష్యాన్ని ఛేదించి ప్రపంచకప్‌లో రికార్డు నెలకొల్పడం.. ఇంగ్లాండ్‌తో 249 పరుగుల ఛేదనలో 68కే 4 వికెట్లు కోల్పోయి కూడా, తర్వాత మరో వికెట్ కోల్పోకుండా 40.3 ఓవర్లలోనే విజయాన్నందుకోవడం ఆసీస్‌కే చెల్లింది.
ఎంత మెరుగైన జట్టుకైనా కొన్ని మ్యాచ్‌ల్లో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. వాటిని అధిగమించి విజయాలు సాధించడమే ఛాంపియన్ జట్టు లక్షణం. ఆస్ట్రేలియా అమ్మాయిలు ఈ ప్రపంచకప్‌లో అదే చేస్తున్నారు. బలమైన ప్రత్యర్థులు అనుకున్న ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాలపై ఆ జట్టు అలవోకగా నెగ్గింది. భారత్‌తో పోరులో కఠిన పరిస్థితులు ఎదురైనా తట్టుకుంది. మొత్తంగా ఒక ఛాంపియన్ జట్టు ఎలా ఆడాలో అలా ఆడుతోంది ఆసీస్. ఏ ఒక్కరి మీదో ఆధారపడకపోవడం.. మ్యాచ్ విన్నర్లుగా నిలవడానికి జట్టు సభ్యులు పోటీ పడుతుండడం ఆ జట్టు విశిష్టతను తెలియజేస్తుంది. భారత్‌పై అలీసా హీలీ గెలిపిస్తే.. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో బెత్ మూనీ గొప్ప ఇన్నింగ్స్ ఆడింది. ఆష్లీ గార్డ్‌నర్ రెండు శతకాలతో జట్టుకు విజయాలను అందించింది. ఆమె బంతితోనూ రాణిస్తోంది. సదర్లాండ్ ఆల్‌రౌండ్ మెరుపులతో అదరగొడుతోంది. ఎలీస్ పెర్రీ ఒకప్పటి స్థాయిలో మెరవకపోయినా.. భారత్‌పై కీలక ఇన్నింగ్స్ ఆడింది. బౌలింగ్‌లో మెగాన్ షట్, అలానా కింగ్, సోఫీ మోలనూ సత్తా చాటుతున్నారు. ఇలా ఆసీస్‌కు ఏ రకంగానూ ఇబ్బంది లేదు.
వీళ్ల మీదే భారం: అత్యంత సవాలుతో కూడిన మ్యాచ్‌లో భారత్‌ను ముందుండి నడిపించాల్సిన బాధ్యత ప్రధానంగా ఓపెనర్ స్మృతి మంధాన, కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ల మీదే ఉంది. వీరికి అపార అనుభవం ఉంది. ఆస్ట్రేలియాపై మంచి రికార్డూ ఉంది. స్మృతి ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉంది. గ్రూప్ దశలో ఆస్ట్రేలియాపై 80 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. ఇక హర్మన్ ఇటీవలి ఫామ్ బాలేకున్నా.. కీలక పోరులో ఆమె జోరందుకుంటుందని జట్టు ఆశిస్తోంది. 2017 సెమీస్ ఇన్నింగ్స్‌ను గుర్తు తెచ్చుకుని మరోసారి ఆమె చెలరేగాలని జట్టు కోరుకుంటోంది. సెమీస్ ముంగిట ఫామ్‌లో ఉన్న ప్రతీక గాయంతో జట్టుకు దూరం కావడం మాత్రం భారత్‌కు గట్టి ఎదురు దెబ్బే. ఆమె ఆసీస్‌పై గ్రూప్ దశలో 75 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడింది.
న్యూజిలాండ్‌పై మెరుపు ఇన్నింగ్స్ ఆడిన జెమీమాపై ఆశలున్నాయి. రిచా ఘోష్, దీప్తి శర్మ సైతం సెమీస్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరముంది. బ్యాటింగ్‌లో ఆసీస్‌కు పోటీ ఇచ్చినా.. బౌలింగ్‌లో మాత్రం భారత్ బలహీనమే. అయితే సెమీస్ పిచ్ స్పిన్‌కు అనుకూలమన్న అంచనాల నేపథ్యంలో ఆ ఆయుధంతోనే భారత్ ప్రత్యర్థిని దెబ్బ కొట్టాల్సి ఉంది. ఫామ్‌లో ఉన్న దీప్తి, శ్రీచరణిలకు తోడు బంగ్లాతో నామమాత్రపు మ్యాచ్‌లో 3 వికెట్లు తీసిన రాధ యాదవ్ మాయాజాలం చేయగలిగితే.. బ్యాటర్లు పట్టుదలతో నిలిస్తే భారత్‌కు అవకాశాలుంటాయి. ప్రస్తుత ఫామ్‌లో ఆసీస్‌ను ఓడించడం తేలిక కాదు. కానీ ఇటీవల గెలుపోటములతో సంబంధం లేకుండా కంగారూలపై ఆత్మవిశ్వాసంతో ఆడుతున్న భారత్.. అదే శైలిలో ఆడి అద్భుత విజయాన్నందుకుంటుందేమో చూడాలి.
2017 మళ్లీ చూస్తామా?
ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో భారత్ పోరు అనగానే ఎక్కువమందికి గుర్తుకొచ్చేది 2017 సెమీస్. ఇంకో కప్పు ఖాయమని ధీమాగా ఉన్న కంగారూలకు ఆ మ్యాచ్‌లో భారత్ మామూలు షాక్ ఇవ్వలేదు. మహిళల క్రికెట్ చరిత్రలోనే ఒకానొక అత్యుత్తమ ఇన్నింగ్స్ అనదగ్గ భారీ శతకం (171 నాటౌట్)తో హర్మన్‌ప్రీత్.. ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించింది. 282 లక్ష్యంతో బరిలోకి దిగిన కంగారూ జట్టు.. 245 పరుగులకు ఆలౌటై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇప్పుడు అదే తరహాలో ఆస్ట్రేలియాకు షాక్ ఇస్తుందేమో అని అభిమానులు ఆశిస్తున్నారు. కానీ కంగారూ జట్టు అప్పుటికంటే చాలా బలంగా కనిపిస్తోంది. ఫామ్ ఇంకా గొప్పగా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

కథానాయకి
మేటి క్రికెటర్లందరూ గొప్ప కెప్టెన్లు అవుతారనే గ్యారెంటీ లేదు. అందుకు చరిత్రలో ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. కానీ కొందరిని చూస్తే సహజ నాయకుల్లా కనిపిస్తారు. - 
                                    
                                        

కసి రేగెను.. కథ మారెను
నెల కిందట మహిళల వన్డే ప్రపంచకప్ ఆరంభమవుతున్నపుడు.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా లాంటి మేటి జట్లను వెనక్కి నెట్టి భారత మహిళల జట్టు విజేతగా నిలవగలదని అనుకున్నామా? - 
                                    
                                        

అంబరాన్ని అంటిన సంబరాలు
దక్షిణాఫ్రికాపై అద్భుత విజయంతో వన్డే ప్రపంచకప్ అందుకున్న భారత్.. ఆదివారం రాత్రంతా సంబరాలు చేసుకుంది. ‘‘మువ్వన్నెల జెండా.. ఉవ్వెత్తున ఎగిరింది. - 
                                    
                                        

కోట్ల రూపాయలు.. వజ్రాల హారాలు
చరిత్రాత్మక వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత మహిళల జట్టుపై నజరానాల వర్షం కురుస్తోంది. హర్మన్‌ప్రీత్ బృందానికి బీసీసీఐ రూ.51 కోట్ల నగదు బహుమతిని ప్రకటించింది. - 
                                    
                                        

ఈ 7 గంటలు మీవే కావాలి..
చక్‌దే ఇండియా సినిమా గుర్తుందా? భారత మహిళల హాకీ జట్టు కోచ్ కబీర్‌ఖాన్ (షారుక్ ఖాన్) ఫైనల్‌కు ముందు తన ప్లేయర్లలో ఎలాగైనా గెలవాలన్న కాంక్షను రగిలిస్తాడు. - 
                                    
                                        

పాపం.. ప్రతీక
ప్రతీక రావల్ ఈ ప్రపంచకప్‌లో భారత్ తరఫున రెండో అత్యధిక స్కోరర్. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉంది. - 
                                    
                                        

సంక్షిప్త వార్తలు(5)
భారత స్టార్ దివ్య దేశ్‌ముఖ్.. చెస్ ప్రపంచకప్‌లో ఓడిపోయింది. ఈ మహిళల ప్రపంచకప్ విజేత.. తొలి రౌండ్లో 0-2తో అర్డిటిస్ (గ్రీస్) చేతిలో పరాజయం చవిచూసింది. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 - 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 


