Bengaluru vs Chennai: మలుపు తిప్పిన రనౌట్.. డుప్లీ సూపర్‌ క్యాచ్‌.. యశ్ లాస్ట్ ఓవర్‌ వీడియోలు వైరల్!

చివరి ఏడు మ్యాచుల్లో ఆరు గెలిచి.. ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ, బెంగళూరు ఆ ఫీట్‌ను సాధించింది. 

Updated : 21 May 2024 15:16 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వరుసగా ఆరో విజయం సాధించి ప్లేఆఫ్స్‌లోకి అడుగు పెట్టింది రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు. కీలకమైన మ్యాచ్‌లో చెన్నైను ఆర్సీబీ ఓడించింది. తీవ్ర ఒత్తిడి ఉన్న ఈ పోరులో  మొదటి ఓవర్‌ నుంచి చివరి వరకూ బెంగళూరు పోరాటం ఆకట్టుకుంది. మరోవైపు చెన్నై కూడా ‘ప్లేఆఫ్స్‌’ కోసం శ్రమించినా సరిపోలేదు. మరి ఈ మ్యాచ్‌ హైలైట్స్‌ను వీడియోల రూపంలో.. 

రచిన్‌ దూకుడు.. రనౌట్‌తో అడ్డుకట్ట

బెంగళూరుపై అదరగొడుతూ కీలక ఇన్నింగ్స్‌ ఆడిన రచిన్‌ రవీంద్ర (61) రనౌట్‌ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. మ్యాక్స్‌వెల్ (12.6వ ఓవర్) బంతిని ఆడే క్రమంలో బ్యాక్‌వర్డ్‌ స్క్వేర్‌ లెగ్‌సైడ్‌ కొట్టాడు. స్పప్నిల్ సింగ్‌ నేరుగా వికెట్‌ కీపర్‌కు విసరడంతో రెండో పరుగు తీసే క్రమంలో రచిన్ రనౌటయ్యాడు. అప్పటికే చెన్నై స్కోరు 13 ఓవర్లకు 115/4.


ఫాఫ్ డుప్లెసిస్‌ సూపర్ క్యాచ్‌

సిరాజ్‌ వేసిన (14.6వ ఓవర్) ఫుల్‌టాస్‌ బంతిని చెన్నై బ్యాటర్ సాంట్నర్ మిడాఫ్‌ మీదుగా కొట్టాడు. అక్కడే కాచుకుని ఉన్న ఆర్సీబీ సారథి డుప్లెసిస్‌ ఎగిరి ఒక్కఉదుటన పట్టేశాడు. ఆ సూపర్‌ క్యాచ్‌కు విరాట్ కోహ్లీ కూడా సంభ్రమాశ్చర్యానికి గురి కావడం విశేషం.


తొలి బంతికే సిక్స్‌.. వెరవని యశ్‌

ఎంఎస్ ధోనీ తొలి బంతికే సిక్స్‌ కొట్టడంతో మ్యాచ్‌ తీవ్ర ఉత్కంఠకు దారి తీసింది. అతడిని ఔట్ చేసిన యశ్‌.. చివరి ఐదు బంతుల్లో కేవలం ఒక్క పరుగుఉ మాత్రమే ఇచ్చాడు. ఆ సూపర్బ్‌ ఓవర్‌ హైలైట్స్‌ను చూసేయండి..


మాటల్లో వర్ణించలేని ఆనందం..

ప్లేఆఫ్స్‌ అవకాశాలు దాదాపు మూసుకుపోయిన వేళ.. వరుసగా ఆరు విజయాలు సాధించి నాకౌట్‌కు చేరుకున్న బెంగళూరు జట్టు సంబరాలు ఆకాశాన్నంటాయి. సీఎస్కే డగౌట్‌ చిన్నబోగా.. ఆర్సీబీ ఆటగాళ్లు, వారి కుటుంబ సభ్యులు, మద్దతుగా నిలిచిన అభిమానులు సంబరాలు చేసుకున్నారు.


డ్రెస్సింగ్‌ రూమ్‌లో డీకే స్పెషల్ క్లాస్‌

మ్యాచ్‌ ముగిసిన తర్వాత ఆర్సీబీ డ్రెస్సింగ్‌ రూమ్‌ చాలా కోలాహలంగా మారిపోయింది. ఈ క్రమంలో సీనియర్‌ ఆటగాడు దినేశ్‌ కార్తిక్ ప్రత్యేకంగా మాట్లాడాడు. ‘‘దశాబ్దాలపాటు మనల్ని అభిమానులు గుర్తు పెట్టుకోవాలంటే ప్రత్యేకంగా ఏదొకటి చేయాలి. వారికి ఆర్సీబీ స్పెషల్‌ టీమ్‌గా అనిపించాలి’’ అంటూ ఉపన్యాసం ఇచ్చాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు