IPL 2024 Final: కోల్‌కతాతో ఫైనల్‌.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కీలక నిర్ణయం!

కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఫైనల్‌కు వెళ్లే ముందు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (Sunrisers Hyderabad) ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  

Published : 25 May 2024 17:59 IST

ఇంటర్నెట్ డెస్క్: రెండు నెలలపాటు అభిమానులను అలరించిన ఐపీఎల్‌ 17వ సీజన్‌ తుది దశకు చేరుకుంది. ఆదివారం టైటిల్ పోరులో కోల్‌కతా నైట్‌రైడర్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (Sunrisers Hyderabad) జట్లు తలపడనున్నాయి. క్వాలిఫయర్‌-2కు ఆతిథ్యం ఇచ్చిన చెపాక్‌ స్టేడియంలోనే ఫైనల్‌ మ్యాచ్‌ (IPL 2024 Final) జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌కు ముందు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. శుక్రవారం క్వాలిఫయర్‌-2లో రాజస్థాన్‌ను ఓడించిన ఆరెంజ్‌ ఆర్మీ.. ఒక్కరోజు విరామం అనంతరం ఫైనల్‌ మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. అయితే, శనివారం నిర్వహించాల్సిన తమ ప్రాక్టీస్‌ సెషన్‌ను రద్దు చేయాలని నిర్ణయం తీసుకుందట. ఈ మేరకు జాతీయమీడియాలో కథనాలు వస్తున్నాయి. చెన్నైలో అధిక ఉష్ణోగ్రతలు, తేమ ఎక్కువగా ఉండడంతో ఆటగాళ్లు ఫిట్‌గా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.   

మరోవైపు.. క్వాలిఫయర్ 1లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టు. కీలక మ్యాచ్‌కు ముందు కేకేఆర్‌ ఆటగాళ్లకు నాలుగు రోజులు విశ్రాంతి దొరికింది. కోల్‌కతా జట్టు శుక్రవారం ప్రాక్టీస్ సెషన్‌ను నిర్వహించింది. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మరో ప్రాక్టీస్‌ సెషన్‌ను ఏర్పాటుచేయాలని చూస్తోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు