Sunil Gavaskar: అందుకే ధోనీ ‘తలా ఫర్‌ ఏ రీజన్‌’: సునీల్ గావస్కర్‌

ఐపీఎల్‌-17 సీజన్‌లో భాగంగా ఏప్రిల్ 14న ముంబయి, చెన్నై తలపడనున్నాయి. ఈ సందర్భంగా భారత మాజీ ఆటగాడు సునీల్ గావస్కర్‌.. ధోనీ (MS Dhoni) కెప్టెన్సీలో ఉన్న ప్రత్యేకతను వివరించాడు. 

Updated : 14 Apr 2024 16:51 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ను అత్యంత విజయవంతం చేసిన సారథి ఎంఎస్‌ ధోనీ (MS Dhoni). 14 సీజన్లకు నాయకత్వం వహించి ఐదు టైటిళ్లు అందించాడు. ఈ సీజన్‌ ఆరంభంలో ధోనీ నాయకత్వ బాధ్యతల నుంచి వైదొలిగాడు. రుతురాజ్‌ గైక్వాడ్‌ను చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌గా నియమించింది. ప్రతిభ ఉన్న ఆటగాళ్లను వెన్నుతట్టి ప్రోత్సహించడంలో ధోనీ ముందుంటాడు. అతడి కెప్టెన్సీలో ఆడిన ఎంతోమంది ఆటగాళ్లు ప్రస్తుతం టీమ్‌ఇండియాలో కీలకంగా ఉన్నారు. ఐపీఎల్‌-17వ సీజన్‌లో భాగంగా ఏప్రిల్ 14న ముంబయి, చెన్నై తలపడనున్నాయి. ఈ సందర్భంగా భారత మాజీ ఆటగాడు సునీల్ గావస్కర్‌ ధోనీ కెప్టెన్సీలో ఉన్న ప్రత్యేకతను వివరించాడు.

‘‘నాకు రెండు జట్లపై అభిమానం ఉంది. నేను ముంబయికి చెందినవాడిని కాబట్టి ముంబయి ఇండియన్స్‌. మరొకటి టీమ్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌. ఐపీఎల్‌లో వివిధ దేశాల నుంచి, వివిధ నగరాల నుంచి జట్టులోకి వస్తుంటారు. వాళ్లందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి ఐపీఎల్‌ ట్రోఫీ లక్ష్యంగా సిద్ధం చేయాలి. ఆరు వారాల్లో టోర్నీ విజేతగా నిలిచి టైటిల్‌ను అందుకోవాలి. ఈ క్రమంలో టీమ్‌లో కొంతమంది గొప్ప ఆటగాళ్లు ఉన్నా జట్టు కూర్పులో భాగంగా కొన్నిసార్లు వారిని పక్కనపెట్టాల్సి వస్తుంది. అప్పుడు, తాము నిరుపయోగంగా ఉన్నామనే భావన వారిలో రానివ్వకూడదు. జట్టులో అంతర్భాగంగా ఉన్నామనే ఫీలింగ్‌ ఆ ఆటగాళ్లలో కలిగించాల్సి ఉంటుంది. ధోనీలో ఈ సామర్థ్యాలన్నీ ఉన్నాయి. అందుకే అతడిని ‘తలా ఫర్‌ ఏ రీజన్‌’ అంటాం అని సునీల్ గావస్కర్ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని