T20 World Cup 2024: ‘‘ఆ నాలుగే.. టీ20 వరల్డ్‌ కప్ సెమీఫైనలిస్ట్‌లు’’

ప్రతీ రెండేళ్లకొకసారి జరిగే టీ20 ప్రపంచకప్‌ సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. మరో నాలుగు రోజుల్లో తొలి మ్యాచ్‌ ప్రారంభం కానుంది. 

Published : 29 May 2024 18:28 IST

ఇంటర్నెట్ డెస్క్: జూన్ 2 నుంచి టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2024) సంబరం మొదలుకానుంది. విండీస్ - యూఎస్‌ఏ సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. కెనడాతో యూఎస్‌ఏ టోర్నీ ఆరంభ మ్యాచ్‌ను ఆడనుంది. భారత జట్టు జూన్ 5న తన మొదటి మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో తలపడనుంది. పాకిస్థాన్‌, యూఎస్‌ఏ, కెనడా, ఐర్లాండ్‌తో కూడిన గ్రూప్‌లో టీమ్‌ఇండియా ఆడనుంది. ఈ మ్యాచులన్నీ అమెరికా వేదికగా జరుగుతాయి. ఈ గ్రూప్‌ స్టేజ్‌ను భారత్‌ అలవోకగా దాటేసే అవకాశం ఉంది. సూపర్ - 8లోనే అసలైన సవాల్ ఎదురుకానుంది. ఈ క్రమంలో సెమీస్‌కు చేరే నాలుగు జట్లేవనేది ఆసక్తికరంగా మారింది.

సెమీస్‌లో తలపడే నాలుగు జట్లను భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ వెల్లడించాడు. అతడితోపాటు పలువురు మాజీ క్రికెటర్లు  స్పందించారు. అందరూ కూడా భారత్‌ సెమీస్‌కు వెళ్తుందని చెప్పడం విశేషం. గతేడాది సెమీస్‌కు చేరిన నాలుగు టీముల్లో  పాకిస్థాన్‌ ఒకటి. కానీ, చాలామంది మాజీలు ఈసారి ఆ జట్టుపై నమ్మకం ఉంచలేదు. 

సునీల్ గావస్కర్: భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, వెస్టిండీస్

అంబటి రాయుడు: భారత్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా

బ్రియాన్ లారా: భారత్, ఇంగ్లాండ్, వెస్టిండీస్, అఫ్గానిస్థాన్

పాల్ కాలింగ్‌వుడ్: ఇంగ్లాండ్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, భారత్

క్రిస్ మోరిస్: భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా

మ్యాథ్యూ హేడెన్: ఆస్ట్రేలియా, భారత్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా

ఆరోన్ ఫించ్: భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, వెస్టిండీస్

మహమ్మద్‌ కైఫ్‌: భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్

టామ్‌ మూడీ: ఆస్ట్రేలియా, భారత్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్

శ్రీశాంత్‌: భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని