T20 World Cup: టీ20 వరల్డ్‌ కప్‌.. ప్రసార హక్కులు ఇలా..

T20 World Cup: టీ20 ప్రపంచ కప్‌ జూన్‌ 2 నుంచి జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రసార హక్కులను దక్కించుకున్న బ్రాడ్‌కాస్టర్ల వివరాలను ఐసీసీ ఇటీవల ప్రకటించింది.

Published : 30 May 2024 08:31 IST

T20 World Cup | ఇంటర్నెట్‌ డెస్క్‌: క్రికెట్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్‌నకు (T20 World Cup) సర్వం సిద్ధమైంది. శనివారం అమెరికా, కెనడా జట్ల మధ్య డల్లాస్‌ వేదికగా తొలి మ్యాచ్‌ జరగనుంది. రోహిత్‌ శర్మ నేతృత్వంలోని టీమ్ఇండియా జూన్ 5న న్యూయార్క్‌లో తొలి మ్యాచ్‌ ఐర్లాండ్‌తో ఆడనుంది. అభిమానులను ఉర్రూతలూగించే భారత్‌ వర్సెస్‌ పాకిస్థాన్‌ కీలక పోరు జూన్‌ 9న జరగనుంది. ఈ నేపథ్యంలో ఆయా దేశాల్లో ఈ వరల్డ్‌ కప్‌ ప్రసార హక్కులను దక్కించుకున్న బ్రాడ్‌కాస్టర్ల వివరాలను ఐసీసీ ఇటీవల ప్రకటించింది.

భారత్‌లో టీ20 వరల్డ్‌ కప్‌ (T20 World Cup) ప్రసార హక్కులను స్టార్ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌తో పాటు డిస్నీ+ హాట్‌స్టార్‌ దక్కించుకున్నాయి. స్టార్‌ స్పోర్ట్స్‌లో హిందీ, తమిళం, తెలుగు, కన్నడ భాషల్లోనూ కామెంటరీ వినొచ్చు. తొలిసారి ఆడియో డిస్క్రిప్టివ్‌ కామెంటరీతో పాటు ఇండియన్‌ సైన్‌ లాంగ్వేజ్‌లోనూ ఫీడ్‌ అందించనుంది. తద్వారా చూపులేనివారు, వినికిడి లోపం ఉన్నవాళ్లు కూడా మ్యాచ్‌ను సులభంగా అర్థం చేసుకునే ఏర్పాట్లు చేసింది.

బెంగంతా బంతితోనే..

మరోవైపు గత ఏడాది జరిగిన వరల్డ్‌ కప్‌ తరహాలో ఈసారి కూడా ‘వర్టికల్‌ ఫీడ్‌’ ఫార్మాట్‌లోనూ మ్యాచ్‌లను అందించే ఏర్పాట్లు చేశారు. తద్వారా అభిమానులకు సులభమైన, మరింత స్పష్టమైన మొబైల్ ఫోన్ వీక్షణ అనుభవాన్ని అందించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని