గ్రూప్-1 మళ్లీ నిర్వహించాలి
గన్‌పార్కు ధర్నాలో కల్వకుంట్ల కవిత

నిరుద్యోగులకు మద్దతుగా నిర్వహించిన ధర్నాలో కల్వకుంట్ల కవిత
నారాయణగూడ, న్యూస్‌టుడే: తక్షణమే గ్రూప్-1 నియామకాలు రద్దు చేసి, మళ్లీ పరీక్ష నిర్వహించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆందోళనలు చేస్తున్న నిరుద్యోగులకు మద్దతుగా జాగృతి ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌లోని గన్‌పార్కులో తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ధర్నా నిర్వహించారు. కవిత, జాగృతి కార్యకర్తలు, నిరుద్యోగులు ప్లకార్డు పట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ‘ఇంత జరుగుతున్నా ప్రభుత్వంలో చలనం లేకపోవడం అప్రజాస్వామికం. గ్రూప్-1లో ప్రిలిమ్స్ నుంచీ అవకతవకలు జరిగాయి. ఈ పరీక్ష తెలంగాణ బిడ్డల కోసమా? కాంగ్రెస్ పార్టీ నాయకుల పిల్లల కోసమా? నిరుద్యోగులకు ఎందుకింత అన్యాయం చేస్తున్నారు? రెండు లక్షల ఉద్యోగాలని నమ్మించి, పాత ఉద్యోగాలిచ్చి కాంగ్రెస్ గొప్పలు చెప్పుకొంటోంది. తెలంగాణలోని మేధావులు మౌనం వీడాలి, నిరుద్యోగులకు మద్దతుగా గళం విప్పి సర్కారును నిలదీయాలి’ అని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

చిన్నారితో అసభ్య ప్రవర్తన.. హైదరాబాద్‌లో డ్యాన్స్ మాస్టర్ అరెస్టు
 - 
                        
                            

తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ విధానంపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు
 - 
                        
                            

బిహార్ అసెంబ్లీ పోరు.. ముగిసిన తొలిదశ ప్రచారం
 - 
                        
                            

విద్యార్థులతో కాళ్లు నొక్కించుకున్న టీచర్ సస్పెండ్
 - 
                        
                            

రోడ్డెక్కిన సీఎం.. ‘ఎస్ఐఆర్’కు వ్యతిరేకంగా నిరసనలు
 - 
                        
                            

ఛత్తీస్‌గఢ్‌లో రెండు రైళ్లు ఢీ.. పలువురు మృతి
 


