రాహుల్‌ను బిహార్‌ ఎన్నికల్లో నిలదీస్తాం: కవిత

Eenadu icon
By Telangana News Team Published : 15 Oct 2025 04:19 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

నిరుద్యోగ అభ్యర్థులతో కలిసి నినాదాలు చేస్తున్న కవిత

గాంధీనగర్, న్యూస్‌టుడే: నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీని బిహార్‌ ఎన్నికల్లో నిలదీస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని చిక్కడపల్లి నగర కేంద్ర గ్రంథాలయంలో గ్రూప్‌-1 అభ్యర్థులను పరామర్శించేందుకు వచ్చిన ఆమెను లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. అనంతరం గ్రంథాలయంలోకి చేరుకున్న ఆమె నిరుద్యోగులతో కలిసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ... ‘‘నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు పోరాడతాం. హైకోర్టులో అనుకూలంగా తీర్పురాకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తాం. గత కేసీఆర్‌ ప్రభుత్వంతోపాటు ప్రస్తుత రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలోనూ గ్రూప్‌-1లో అవకతవకలు జరిగాయని విద్యార్థులు అంటున్నారు. కచ్చితంగా పరీక్షను రద్దుచేసి మళ్లీ నిర్వహించాలి. రెండు లక్షల ఉద్యోగాలకు తక్షణమే నోటిఫికేషన్లు విడుదల చేయాలి’’ అని ఆమె డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు వెంకటేశ్, శంకర్‌నాయక్, కృష్ణ పాల్గొన్నారు. 


25 నుంచి కవిత రాష్ట్రవ్యాప్త యాత్ర 

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ నెల 25 నుంచి రాష్ట్రవ్యాప్తంగా యాత్ర చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను బుధవారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆమె ఆవిష్కరిస్తారు. 33 జిల్లాల్లోనూ పర్యటన ఉండేలా ప్రణాళిక రూపొందించారు. ప్రతి జిల్లాలోనూ రెండు రోజులు పర్యటిస్తారు. స్థానికంగా మేధావులు, అన్ని వర్గాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో ఆమె సమావేశమవుతారని జాగృతి వర్గాలు తెలిపాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని