హన్మంతూ.. అడవి వదిలిరా..!

Eenadu icon
By Telangana News Desk Updated : 03 Nov 2025 05:27 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

మావోయిస్టు అగ్రనేతకు కుటుంబ సభ్యుల విజ్ఞప్తి

ఈనాడు, హైదరాబాద్‌: మావోయిస్టు పార్టీలో లొంగుబాట్ల పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో అగ్రనేతల కుటుంబ సభ్యులు తమ వారిని జనజీవన స్రవంతిలో కలిసేలా ఒప్పించేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. పార్టీ అగ్రనేత పాక హన్మంతు అలియాస్‌ ఊకే గణేశ్‌.. కంధమాల్‌ అటవీప్రాంతంలో కార్యకలాపాలు సాగిస్తున్నారనే సమాచారం ఆధారంగా ఆయన బావ ప్రదీప్‌ మరికొందరితో కలిసి ఒడిశా వెళ్లారు. అక్కడ వారం రోజులు వేచి చూసి, కలవడం సాధ్యం కాకపోవడంతో 5 నిమిషాల నిడివి ఉన్న వీడియోతోపాటు లేఖ విడుదల చేశారు. నల్గొండ జిల్లా చండూరు మండలం పుల్లెంలకు చెందిన హన్మంతు బీఎస్సీ చదువుతున్నప్పుడే పీపుల్స్‌వార్‌ ఉద్యమానికి ఆకర్షితుడై, చదువు మధ్యలోనే వదిలేసి అడవిబాట పట్టారు. ప్రస్తుతం మావోయిస్టు కేంద్రకమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఆయనపై రూ.25లక్షల రివార్డు ఉంది.

లేఖలో ఏముందంటే..

‘మీరు 43 ఏళ్లుగా ప్రజల కోసం పోరాడుతున్నారు. ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా లేవు. మీతోపాటు పనిచేసిన నేతలు జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. మీరు కూడా ఆ బాట అనుసరించండి.  తెలంగాణ ప్రభుత్వం సరెండర్‌ అయిన వారిని అన్నివిధాలా ఆదుకుంటోంది. ఒడిశాలో కలవడానికి ప్రయత్నించినా కుదరకపోవడంతో ఈ లేఖ, వీడియో పంపుతున్నాం. ఏమాత్రం అవకాశమున్నా 90000 95011కు ఫోన్‌ చేయగలరు’ అని ప్రదీప్‌ కోరారు.

Tags :
Published : 03 Nov 2025 04:56 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు