Kavitha: ఇది బీసీల ఆత్మగౌరవ పోరాటం
42% రిజర్వేషన్లపై సీఎం రేవంత్‌రెడ్డి చిత్తశుద్ధితో పని చేయాలి
72 గంటల నిరాహార దీక్షలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 

వేదికపై మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కవిత, యూపీఎఫ్, తెలంగాణ జాగృతి నాయకులు
ఈనాడు డిజటల్, హైదరాబాద్, రాంనగర్, న్యూస్‌టుడే: ఉద్యమాలతో తెచ్చుకున్న తెలంగాణలో అన్నివర్గాలు బాగున్నప్పుడే రాష్ట్రం ప్రగతిపథంలో నడుస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టంచేశారు. సోమవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద 42% బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఆమె 72 గంటల నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ‘‘కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్‌లో చెప్పినట్లుగా రాష్ట్రంలో సగభాగం ఉన్న బీసీలకు రిజర్వేషన్లు కల్పించి న్యాయం చేయాలి. తెలంగాణ జాగృతి, యునైటెడ్ ఫులే ఫ్రంట్‌్(యూపీఎఫ్) ఉద్యమాల కారణంగా రిజర్వేషన్ల బిల్లు అసెంబ్లీలో పెట్టారు. ఇది రాజకీయ పోరాటం కాదు.. బీసీల ఆత్మగౌరవ పోరాటం. రిజర్వేషన్ల విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంపై నెట్టేస్తుంటే.. ఇది రాష్ట్రాల వ్యవహారమని కేంద్రం చెబుతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిజంగా బీసీల పక్షపాతి అయితే అసెంబ్లీలో పెట్టిన బిల్లును చిత్తశుద్ధితో అమలు చేయాలి. మైనార్టీలకు 10% రిజర్వేషన్లపై ప్రత్యేకంగా బిల్లు పెట్టే విషయంపై స్పష్టత ఇవ్వాలి. తెలంగాణలో ధర్నాలు చేయడానికి చౌక్‌లు ఏర్పాటు చేశామని దిల్లీలో గొప్పలు చెబుతున్న సీఎం రేవంత్‌రెడ్డి, మేం ధర్నాలు చేస్తామంటే ఎందుకు భయపడుతున్నారు? బీసీలకు రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక సంస్థల ఎన్నికలు జరిపించాలి’’ అని కవిత పేర్కొన్నారు. ఆమె నిరాహార దీక్షకు మాజీ ఉపప్రధాని దేవీలాల్ మునిమనవడు, ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ నాయకుడు అర్జున్‌సింగ్ చౌటాలా మద్దతు తెలిపారు. యూపీఎఫ్ కన్వీనర్ శివశంకర్, కోకన్వీనర్ హరి తదితరులు పాల్గొన్నారు. అయితే సాయంత్రం 4 గంటల తరువాత ఎటువంటి నిరసనలు తెలపొద్దంటూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో.. దీక్షను విరమిస్తున్నట్లు కవిత ప్రకటించారు.
కేసీఆర్‌తో దిల్లీలో దీక్ష చేయాలి
-ఆది శ్రీనివాస్
హైదరాబాద్, న్యూస్‌టుడే: బీసీలపట్ల చిత్తశుద్ధి ఉంటే భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్‌తో కలిసి దిల్లీలో దీక్ష చేయాలని ఎమ్మెల్సీ కవితకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సూచించారు. హైదరాబాద్‌లో దీక్ష చేస్తే ఏం లాభం? అని సోమవారం ఆయనొక ప్రకటనలో ప్రశ్నించారు. ‘ఇందిరాపార్కు దగ్గర కవిత దీక్ష చేయడం భాజపాకు లాభం చేయడానికేనా? మీ దీక్షకు భారత రాష్ట్ర సమితి మద్దతు ఉందా?’ అని ప్రశ్నించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత గురించి మాట్లాడే అర్హత భారత రాష్ట్ర సమితికి లేదని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఒక ప్రకటనలో విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

మంత్రి అజారుద్దీన్‌కు శాఖల కేటాయింపు
 - 
                        
                            

నాకు ఏం జరిగిందో గుర్తులేదా..? థరూర్‌ను హెచ్చరించిన భాజపా నేత
 - 
                        
                            

లాలూ తాతలు దిగొచ్చినా.. ఆ సొమ్ము దోచుకోలేరు: అమిత్ షా
 - 
                        
                            

చాట్‌జీపీటీ గో ఫ్రీ ప్లాన్ .. ఎలా పొందాలంటే?
 - 
                        
                            

వివేకా హత్య కేసు.. సీబీఐ కోర్టులో సునీల్‌యాదవ్ కౌంటర్ దాఖలు
 - 
                        
                            

ప్రపంచంలో నెక్ట్స్ సూపర్ పవర్‌గా భారత్: ఫిన్లాండ్ అధ్యక్షుడు
 


