జాతీయ బీసీ కమిషన్‌ ఎదుట ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ హాజరు

రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి, కార్యదర్శి శ్రీనివాసరావు శుక్రవారం దిల్లీలో జాతీయ బీసీ కమిషన్‌ ఎదుట విచారణకు హాజరయ్యారు. ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌

Published : 04 Dec 2021 05:05 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి, కార్యదర్శి శ్రీనివాసరావు శుక్రవారం దిల్లీలో జాతీయ బీసీ కమిషన్‌ ఎదుట విచారణకు హాజరయ్యారు. ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో బీటెక్‌ బి కేటగిరీ సీట్ల కేటాయింపులో బీసీలకు రిజర్వేషన్‌ అమలుచేయకపోవడంతో తమకు అన్యాయం జరుగుతుందని కొందరు విద్యార్థులు కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు విచారణకు హాజరై వివరణ ఇచ్చారు. యాజమాన్య కోటా మొదలైన నాటి బి కేటగిరీ సీట్ల భర్తీలో రిజర్వేషన్‌ లేదని, కన్వీనర్‌ కోటా కింద భర్తీ చేసే 70 శాతం సీట్లలోనే అది అమలులో ఉందని విద్యామండలి ఛైర్మన్‌ వివరణ ఇచ్చినట్లు తెలిసింది. జాతీయ స్థాయిలో బి కేటగిరీలో కూడా రిజర్వేషన్‌ ఉండాలని కేంద్రం నిర్ణయం తీసుకుంటే అమలుకు తమకు అభ్యంతరం లేదని చెప్పినట్లు తెలిసింది.  విచారణలో కమిషన్‌ సభ్యులు ఆచారి తల్లోజు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని