మనోవేదనతో వీఆర్‌ఏ మృతి

రెండు నెలలుగా వేతనాలు అందక పోవడంతో మనోవేదనకు గురైన ఓ వీఆర్‌ఏ హఠాన్మరణం చెందారు. ఈ ఘటన మెదక్‌ జిల్లా శివ్వంపేట మండలంలో మంగళవారం చోటుచేసుకుంది.

Updated : 05 Oct 2022 05:56 IST

శివ్వంపేట, న్యూస్‌టుడే: రెండు నెలలుగా వేతనాలు అందక పోవడంతో మనోవేదనకు గురైన ఓ వీఆర్‌ఏ హఠాన్మరణం చెందారు. ఈ ఘటన మెదక్‌ జిల్లా శివ్వంపేట మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. చుక్క సత్తయ్య దొంతి వీఆర్‌ఏగా పనిచేస్తూ 12 ఏళ్ల కిందట అనారోగ్యంతో మృతిచెందారు. అనంతరం ఆయన భార్య చుక్క నర్సమ్మ (55) వీఆర్‌ఏగా విధులు నిర్వహిస్తున్నారు. 72 రోజులుగా తమ సమస్యల పరిష్కారం కోసం వీఆర్‌ఏలు ఆందోళన చేస్తుండగా అందులో నర్సమ్మ పాల్గొంటున్నారు. రెండు నెలలుగా వేతనాలు రాకపోవడంతో బతుకమ్మ, దసరా పండగలు ఎలా చేసుకోవాలని ఆమె బెంగ పెట్టుకున్నారు. ఇదే మనోవేదనతో ఉన్న నర్సమ్మ మంగళవారం గుండె ఆగి మృతి చెందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని