ఎంత‘కీ’ సరిపోని సమాధానాలు.. టీఎస్‌-సెట్‌పై అభ్యంతరాల వెల్లువ

రాష్ట్ర ప్రభుత్వం మార్చి 14 నుంచి 17 వరకు నిర్వహించిన టీఎస్‌-సెట్‌లోని ప్రశ్నలకు, ‘కీ’లోని సమాధానాలకు పొంతన లేకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.

Updated : 28 Mar 2023 05:25 IST

ఈనాడు-హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం మార్చి 14 నుంచి 17 వరకు నిర్వహించిన టీఎస్‌-సెట్‌లోని ప్రశ్నలకు, ‘కీ’లోని సమాధానాలకు పొంతన లేకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ పరీక్షకు సంబంధించిన ‘కీ’ను నిర్వాహకులు శనివారం విడుదల చేశారు. సమాధానాలపై అభ్యంతరాలుంటే.. ఆధారాలు సహా టీఎస్‌సెట్‌ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. దీంతో అభ్యర్థులు పెద్దసంఖ్యలో అభ్యంతరాలను తెలుపుతున్నారు. పీజీ, ఇతర పుస్తకాల్లోని పేజీ నంబర్లు సహా సరైన సమాధానాలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. ఆంగ్ల భాష-2 ప్రశ్నపత్రంలో 33, రాజనీతి శాస్త్రంలో 11 ప్రశ్నలకు సమాధానాలు సక్రమంగా లేవని, సోషల్‌ వర్క్‌కు సంబంధించి 9 ప్రశ్నల జవాబులు తప్పుగా ఉన్నాయని, మరో 16 ప్రశ్నలకు అరకొర సమాధానాలే ఉన్నాయని అభ్యర్థులు తెలిపారు. దీనిపై టీఎస్‌-సెట్‌ సభ్య కార్యదర్శి ప్రొఫెసర్‌ సి.మురళీకృష్ణను వివరణ కోరగా.. సాంకేతిక సమస్యల కారణంగా పొరపాట్లు దొర్లాయని, ఈ నెల 29న తుది ‘కీ’ని విడుదల చేస్తామని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని