12 రైళ్లకు అదనపు స్టాపులు

తెలంగాణ మీదుగా రాకపోకలు సాగించే 12 రైళ్ల(ఆరు జతలు)కు ప్రయోగాత్మకంగా అదనపు స్టాపులు ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వేశాఖ తెలిపింది.

Published : 12 Jul 2023 05:32 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ మీదుగా రాకపోకలు సాగించే 12 రైళ్ల(ఆరు జతలు)కు ప్రయోగాత్మకంగా అదనపు స్టాపులు ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. దక్షిణ్‌ ఎక్స్‌ప్రెస్‌ ఇక జమ్మికుంట రైల్వేస్టేషన్‌లో ఆగనుంది. ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌- హజ్రత్‌ నిజాముద్దీన్‌ రైలు వరంగల్‌లో, ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌-అహ్మదాబాద్‌, సికింద్రాబాద్‌-రాయపూర్‌, సికింద్రాబాద్‌-హిస్సార్‌, హైదరాబాద్‌-రాక్సల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు పెద్దపల్లిలో ఆగనున్నాయి. ఈ నిర్ణయం 15, 16, 17 తేదీల నుంచి అమల్లోకి రానున్నట్లు దక్షిణ మధ్య రైల్వే మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది.

రైళ్ల రద్దు: తిరుపతి రైల్వేస్టేషన్‌ అభివృద్ధి పనుల నేపథ్యంలో  కాజీపేట-తిరుపతి, తిరుపతి-కాజీపేట (07091, 07092) రైళ్లు జులై 18, 25, ఆగస్టు 1, 8 తేదీల్లో రద్దయ్యాయి. హైదరాబాద్‌-తిరుపతి, తిరుపతి-హైదరాబాద్‌ (07643/07644) రైళ్లు 17, 24, 31 ఆగస్టు 8 తేదీల్లో రేణిగుంట-తిరుపతి మధ్య రద్దయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని