దేశంలో మరో 114 కృషి విజ్ఞాన కేంద్రాలు

వ్యవసాయరంగ అభివృద్ధితోపాటు రైతులకు విస్తృతమైన సేవలందించేందుకు దేశంలో మరో 114 కృషి విజ్ఞాన కేంద్రాల(కేవీకే)ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి(ఐకార్‌) డైరెక్టర్‌ జనరల్‌ హిమాన్ష్‌ పాఠక్‌ తెలిపారు.

Published : 20 Apr 2024 04:33 IST

ఐకార్‌ డైరెక్టర్‌ హిమాన్ష్‌ పాఠక్‌

ఈనాడు, హైదరాబాద్‌: వ్యవసాయరంగ అభివృద్ధితోపాటు రైతులకు విస్తృతమైన సేవలందించేందుకు దేశంలో మరో 114 కృషి విజ్ఞాన కేంద్రాల(కేవీకే)ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి(ఐకార్‌) డైరెక్టర్‌ జనరల్‌ హిమాన్ష్‌ పాఠక్‌ తెలిపారు. ప్రస్తుతం ఉన్న కేవీకేలను నవీకరించి రైతులకు మరింత మెరుగైన సేవలందిస్తామని చెప్పారు. తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని విస్తరణ విద్యాసంస్థలో కేవీకేల వార్షిక కార్యాచరణ ప్రణాళికపై రెండు రోజుల సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. దీనికి పాఠక్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ‘‘దేశంలో కేవీకేలు ప్రారంభించి 50 సంవత్సరాలైంది. అవి వ్యవసాయ రంగంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. మరింత మంది రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు కొత్త వాటిని ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి కేవీకే సొంత బ్రాండ్‌ను సృష్టించుకోవాలి’’ అని తెలిపారు. సదస్సులో మేనేజింగ్‌ డైరెక్టర్‌ జనరల్‌ చంద్రశేఖర్‌ నార్మ్‌ డైరెక్టర్‌ సీహెచ్‌ శ్రీనివాస్‌రావు, వ్యవసాయ సాంకేతిక, పరిశోధన నిర్వహణ సంస్థ(అటారీ) పదో జోన్‌ డైరెక్టర్‌ షేక్‌ మీరా, వ్యవసాయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ వెంకటరమణ, విస్తరణ సంచాలకురాలు సుధారాణి, పరిశోధన సంచాలకుడు రఘురామిరెడ్డి, కేవీకేల సమన్వయకర్తలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని