గరిష్ఠ ధరలో వర్జీనియా పొగాకు

వర్జీనియా పొగాకు ధర రికార్డులను అధిగమిస్తోంది. కొంతకాలంగా కోకో ధరలు కిలో రూ.వెయ్యికి చేరగా... అదే బాటలో వర్జీనియా పొగాకూ పయనిస్తోంది.

Published : 28 Apr 2024 03:52 IST

కిలో రూ.341 నమోదు
కనిష్ఠ ధర రూ.235

అశ్వారావుపేట, న్యూస్‌టుడే: వర్జీనియా పొగాకు ధర రికార్డులను అధిగమిస్తోంది. కొంతకాలంగా కోకో ధరలు కిలో రూ.వెయ్యికి చేరగా... అదే బాటలో వర్జీనియా పొగాకూ పయనిస్తోంది. ఈ ఏడాది వచ్చిన తుపాను ప్రభావం, అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో దీని గిరాకీ పెరిగింది. తాజాగా ఏపీలోని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం వేలం కేంద్రం-2లో శుక్రవారం రూ.319 ధర రాగా, శనివారం కిలో వర్జీనియా పొగాకు ధర రూ.341 పలికింది. కనిష్ఠ ధర రూ.235 లభించింది. దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట, దమ్మపేట ప్రాంత రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. శనివారం 1246 బేళ్లు వేలం కేంద్రానికి తీసుకెళ్లగా, 1030 బేళ్లు వేలంలో కొనుగోలు చేశారు. సగటు ధర రూ.308.08 లభించింది. వర్జీనియా పొగాకు ఇంత ధర పలకడం ఇదే మొదటిసారి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని