గతవైభవ చిహ్నం నేను.. ఇలా మోడునై నిలిచాను!

ఫొటోకు పోజిస్తున్నట్లు ఊడలు, వేర్లతో నిలబడిన ఈ వృక్షాన్ని చూసి ఏదో హారర్‌ సినిమా సెట్టు అనుకుంటే పొరబడినట్లే.. ఇది నిజంగా మర్రిచెట్టే.. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఏసీసీ సిమెంట్ కర్మాగారం ఆవరణలో క్వార్టర్ల నడుమ చాలా ఏళ్ల క్రితం మొక్కలు నాటారు.

Published : 28 Apr 2024 03:54 IST

ఫొటోకు పోజిస్తున్నట్లు ఊడలు, వేర్లతో నిలబడిన ఈ వృక్షాన్ని చూసి ఏదో హారర్‌ సినిమా సెట్టు అనుకుంటే పొరబడినట్లే.. ఇది నిజంగా మర్రిచెట్టే.. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఏసీసీ సిమెంట్ కర్మాగారం ఆవరణలో క్వార్టర్ల నడుమ చాలా ఏళ్ల క్రితం మొక్కలు నాటారు. కొన్ని సంవత్సరాల పాటు ఓ వెలుగు వెలిగిన పరిశ్రమ ఇటీవల మూతపడింది. కార్మికులంతా ఇళ్లు ఖాళీ చేసి వివిధ ప్రాంతాలకు వెళ్లడంతో ఈ క్వార్టర్లను కూల్చివేస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఇంటిని ఆనుకుని ఊడలు, వేర్లతో సహా పెరిగిన మర్రిచెట్టొకటి  గోడలను తొలగించిన అనంతరం ఇలా నిలబడినట్లు కనిపిస్తోంది.

న్యూస్‌టుడే, కాసిపేట

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు