Gunmen Attack: సాయుధ మూకల అరాచకం.. కాల్పుల్లో 40 మంది మృతి..!

సాయుధ మూకలు జరిపిన కాల్పుల్లో 40 మంది పౌరులు మృతి చెందారు. నైజీరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Published : 21 May 2024 22:39 IST

అబూజా: నైజీరియా (Nigeria)లో సాయుధమూకలు అరాచకం సృష్టించాయి. ఆయుధాలు ధరించి మోటారు సైకిళ్లపై వచ్చిన దుండగులు.. ఓ మైనింగ్‌ గ్రామంపై విరుచుకుపడి విచక్షణారహితంగా కాల్పులు జరపడంతోపాటు ఇళ్లకు నిప్పంటించారు. ఈ ఘటనలో దాదాపు 40 మంది మృతి చెందారు.

స్థానిక అధికారుల వివరాల ప్రకారం.. నైజీరియాలోని ప్లీటా రాష్ట్రం గనులకు ప్రసిద్ధి. ఇక్కడి వాసే జిల్లాలో జింక్‌, సీసం నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో వనరులపై ఆధిపత్యం కోసం ఘర్షణలు జరుగుతుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా జురాక్‌ మైనింగ్‌ గ్రామంపై సాయుధులు దాడికి దిగారు. స్థానికులపై కాల్పులు జరపడంతోపాటు ఇళ్లను తగులబెట్టిన ఘటనలో 40 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. ఈ సంఖ్య ఎక్కువే ఉందని స్థానికులు ఓ వార్తాసంస్థతో చెప్పారు.

5 నిమిషాల్లో 6 వేల అడుగుల కిందకి.. సింగపూర్‌ విమానంలో భయానక దృశ్యాలు

నైజీరియాలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుంటాయి. అటవీ ప్రాంతాల్లో స్థావరాలు ఏర్పాటు చేసుకున్న సంచార జాతులకు చెందిన కొన్ని సాయుధ మూకలు గ్రామాలపై దాడులు చేసి దోపిడీలకు పాల్పడుతుంటాయి. స్థానికుల్ని అపహరించి సొమ్మును డిమాండ్‌ చేస్తుంటాయి. 2009 నుంచి ఇప్పటివరకు అనేకసార్లు ఇలాంటి ఘటనలు చోటుచేసుకోగా.. వేలమంది ప్రాణాలు కోల్పోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని