Russia: నావల్నీ మరణం తర్వాత.. పుతిన్‌ విమర్శకుల్లో వణుకు!

అలెక్సీ నావల్నీ మరణం తర్వాత రష్యాలో రాజకీయ ఖైదీల జీవితాలు ప్రమాదంలో ఉన్నాయని వ్లాదిమిర్‌ కారా-ముర్జా అనే పుతిన్‌ విమర్శకుడి భార్య ఆందోళన వ్యక్తం చేశారు.

Published : 26 Mar 2024 00:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రష్యా అధ్యక్షుడు పుతిన్‌ (Putin) ప్రత్యర్థి అలెక్సీ నావల్నీ (Alexei Navalny) మరణం అక్కడి విమర్శకుల్లో వణుకు పుట్టిస్తున్నట్లు తెలుస్తోంది. నావల్నీ మరణం తర్వాత రష్యాలో రాజకీయ ఖైదీల జీవితాలు ప్రమాదంలో ఉన్నాయని వ్లాదిమిర్‌ కారా-ముర్జా (Vladimir Kara-Murza) అనే పుతిన్‌ విమర్శకుడి భార్య ఆందోళన వ్యక్తం చేశారు.

రష్యాలో నిరంకుశ పాలనను వ్యతిరేకించిన ఎంతోమంది కటకటలాపాలయ్యాయని కారా-ముర్జా భార్య ఎవ్జెనియా ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఫ్రీ రష్యా ఫౌండేషన్‌’ స్వచ్ఛంద సంస్థ సలహాదారుగా ఉన్న ఆమె.. పుతిన్‌ పాలనను వ్యతిరేకిస్తోన్న తన భర్తతోపాటు అలెగ్జాండ్రా స్కోచిలెంకో, అలెక్సీ గోరినోవ్‌ తదితర ఎంతోమంది జీవితాలు ప్రమాదంలో ఉన్నాయన్నారు. గతంలో రెండుసార్లు హత్య చేయడానికి యత్నించిన వారి చేతుల్లోనే తన భర్త బందీగా ఉన్నట్లు వాపోయారు.

ఒకే రోజు రెండు రష్యా నౌకలను ధ్వంసం చేసిన ఉక్రెయిన్‌..!

ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధాన్ని కారా-ముర్జా వ్యతిరేకిస్తున్నారు. మాస్కోపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించేందుకు ఆయన లాబీయింగ్‌ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో రాజద్రోహంతో పాటు ఇతర కేసుల్లో ఆయనకు 25 ఏళ్ల జైలు శిక్ష పడింది. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై దురాక్రమణ మొదలుపెట్టిన తర్వాత ఓ ప్రతిపక్ష నాయకుడికి మాస్కో విధించిన శిక్షల్లో అత్యంత కఠినమైంది ఇదే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని