Passport Seva 2.0: దుబాయ్‌లో ఎన్‌ఆర్‌ఐల కోసం.. పాస్‌పోర్ట్ సేవా ప్రోగ్రామ్‌

Eenadu icon
By International News Team Updated : 28 Oct 2025 14:53 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: ఎన్‌ఆర్‌ఐల కోసం దుబాయ్‌ (Dubai)లోని భారత కాన్సులేట్ జనరల్.. పాస్‌పోర్ట్ సేవా ప్రోగ్రామ్ 2.0 (GPSP 2.0)ను ఆవిష్కరించింది. ఆధునికీకరించిన ఈ ప్రోగ్రామ్‌ మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. పాస్‌పోర్టు సేవలను రిజిస్టర్ చేసుకోవడానికి, దరఖాస్తు చేసుకోవడానికి దరఖాస్తుదారులు కొత్తగా లాంచ్‌ అయిన ఆన్‌లైన్‌ పోర్టల్‌ను వినియోగించాల్సి ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్‌, సర్వీస్ సెంటర్లలో ఎదురుచూపులు తగ్గించేందుకు ఈ సేవను అందుబాటులోకి తీసుకువచ్చారు.

పాస్‌పోర్ట్ సేవా ప్రోగ్రామ్ 2.0 కింద ఈ-పాస్‌పోర్టులను తీసుకువచ్చారు. ఈ సాంకేతికతతో ఇమిగ్రేషన్ క్లియరెన్స్‌లు వేగవంతం కానున్నాయి. భారత్‌ అందించే సేవలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మారనున్నాయి. వీసా అవసరాలకు తగ్గట్టుగా ఫొటో, సంతకం, ఇతర పత్రాలను నేరుగా ఆ పోర్టల్‌లోకి అప్‌లోడ్‌ చేసుకోవచ్చు. దాంతో బీఎల్‌ఎస్‌ ఇంటర్నేషనల్ సెంటర్లలో ప్రాసెసింగ్ టైమ్ తగ్గే అవకాశం ఉంటుంది. యూఏఈలో ఉన్న ప్రవాస భారతీయుల కోసం ఈ ప్రోగ్రామ్ ఆధునికీకరణ చేపట్టినట్లు కాన్సులేట్ (Consulate General of India in Dubai) వెల్లడించింది. ఈ సరికొత్త సేవలు పొందేందుకు యూజర్లు ఈ పోర్టల్‌లో రిజిస్టర్ అయి, లాగిన్ కావాల్సి ఉంటుంది. కొత్త అప్లికేషన్‌ను జనరేట్ చేసి, ఫార్మ్‌ను ప్రింట్‌ తీసుకోవాలి. తర్వాత బీఎల్‌ఎస్ ఇంటర్నేషనల్ ద్వారా అపాయింట్‌మెంట్‌ బుక్ చేసుకోవాలి. 

Tags :
Published : 28 Oct 2025 13:28 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని