USA: టెక్సాస్‌ పాన్‌హ్యాండిల్‌ కార్చిచ్చుకు 10 లక్షల ఎకరాలు భస్మం..!

టెక్సాస్‌లో కార్చిచ్చులు తీవ్ర స్థాయిలో వ్యాపిస్తున్నాయి. ఆ రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు ఈ స్థాయిలో మంటలు వ్యాపించడాన్ని ఎన్నడూ చూడలేదు.

Updated : 01 Mar 2024 16:37 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా (USA)లోని టెక్సాస్‌ (Texas) పాన్‌హ్యాండిల్‌ వద్ద కార్చిచ్చులు అత్యంత తీవ్ర రూపం దాల్చాయి. వీటిల్లో అతి పెద్దదైన ది స్మోక్‌ హౌస్‌ క్రీక్‌ కారణంగా ఇప్పటి వరకు దాదాపు 10 లక్షల ఎకరాల్లో ఉన్న చెట్లు, పొలాలు, గృహాలు అగ్నికి ఆహూతయ్యాయి. వీటి తీవ్రతను నమోదు చేయడం మొదలుపెట్టిన 1980 నుంచి ఆ రాష్ట్ర చరిత్రలో ఇదే అతిపెద్ద కార్చిచ్చు. శుక్రవారం కూడా పొడి వాతావరణం కొనసాగనుండటంతో ఇది ఆగే పరిస్థితి లేదు. ఈ అగ్ని కీలలు ఉపగ్రహ చిత్రాల్లో స్పష్టంగా కనిపించడం గమనార్హం. గురువారం సాయంత్రం నాటికి పొరుగు రాష్ట్రమైన ఓక్లహామాలో కూడా మరో 31,500 ఎకరాలను ఇది కాల్చేసింది. అక్కడ కూడా అత్యవసర పరిస్థితి విధించారు.

గాజాలో ఘోరం

టెక్సాస్‌ చుట్టుపక్కల వ్యాపించిన మొత్తం కార్చిచ్చులు కలిపి 2,000 చదరపు కిలోమీటర్ల మేర భస్మం చేశాయి. అమెరికాలోని డెలావేర్‌ రాష్ట్రం విస్తీర్ణానికి ఇది సమానం. ఇప్పటి వరకు స్మోక్‌ హౌస్‌ క్రీక్‌ కార్చిచ్చుకు ఇద్దరు వ్యక్తులు చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు.

  • మంటలు వ్యాపించిన ప్రాంతంలో విద్యుత్తు సరఫరా నిలిచిపోయినట్లు నార్త్‌ పవర్‌ ఎలక్ట్రిక్‌ కో-ఆపరేటివ్‌ సంస్థ ప్రకటించింది. దాదాపు 115 మైళ్లలో ఉన్న విద్యుత్తు తీగలను పునరుద్ధరించాలని తెలిపింది.
  • హెంప్‌హిల్‌ ప్రాంతంలో భారీగా గృహాలు దహనమయ్యాయి. దాదాపు 4,00,000 ఎకరాల్లో మంటలు వ్యాపించాయి. వేల సంఖ్యలో పశువులు చనిపోయాయి. టెక్సాస్‌ రాష్ట్రంలో 85 శాతం పశు సంపద పాన్‌హ్యాండిల్‌ ప్రాంతంలోనే ఉంది.
  • మరోవైపు విండీడ్యూసీ ఫైర్‌, గ్రేప్‌వైన్‌ ఫైర్‌, మెజెంటా ఫైర్‌ వంటివి భారీ స్థాయిలోనే నష్టం చేకూర్చాయి. టర్కీ ట్రాక్‌ రెంచ్‌ ప్రదేశంలోని చారిత్రక ప్రదేశాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని