PM Modi: అఫ్గాన్‌ను అన్ని రకాలుగా ఆదుకుంటాం: ప్రధాని మోదీ

ఇంటర్నెట్ డెస్క్: అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం (Earthquake in Afghanistan) సంభవించంతో వందలమంది ప్రజలు ప్రాణాలు కోల్పోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విపత్తులో కుటుంబసభ్యులను, సన్నిహితులను కోల్పోయిన వారికి తగిన శక్తినివ్వాలని.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. భూకంపం ధాటికి నష్టపోయిన అఫ్గాన్‌కు అన్ని రకాల మనవతా సాయం అందించి.. ఆ దేశాన్ని ఆదుకునేందుకు భారత్ సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.
రిక్టర్ స్కేల్‌పై 6.0 తీవ్రతతో అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. ఈ ఘోర విపత్తు (Earthquake in Afghanistan) కారణంగా 800 మందికి పైగా మరణించినట్లు ఆ దేశ అధికారిక మీడియా సంస్థ రేడియో టెలివిజన్ అఫ్గానిస్థాన్ వెల్లడించింది. మరో 2500 మంది వరకు గాయపడినట్లు తెలిపింది. ఆదివారం అర్ధరాత్రి 11.47 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. భూకంపం కారణంగా పలు గ్రామాల్లోని ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయని వార్దక్ ప్రావిన్స్ మాజీ మేయర్ జరీఫా ఘఫ్పారీ పేర్కొన్నారు. బాధితుల పరిస్థితి దుర్భరంగా ఉందని.. అసమర్థ తాలిబన్ ప్రభుత్వం సహాయ కార్యక్రమాలు చేపట్టలేదన్నారు. ఈ సమయంలో అంతర్జాతీయ సమాజం, మానవతా సంస్థలు సత్వరమే స్పందించి బాధితులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

చిన్నారితో అసభ్య ప్రవర్తన.. హైదరాబాద్‌లో డ్యాన్స్ మాస్టర్ అరెస్టు
 - 
                        
                            

తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ విధానంపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు
 - 
                        
                            

బిహార్ అసెంబ్లీ పోరు.. ముగిసిన తొలిదశ ప్రచారం
 - 
                        
                            

విద్యార్థులతో కాళ్లు నొక్కించుకున్న టీచర్ సస్పెండ్
 - 
                        
                            

రోడ్డెక్కిన సీఎం.. ‘ఎస్ఐఆర్’కు వ్యతిరేకంగా నిరసనలు
 - 
                        
                            

ఛత్తీస్‌గఢ్‌లో రెండు రైళ్లు ఢీ.. పలువురు మృతి
 


