Dubai: భారతీయులకు దుబాయ్‌ ఆఫర్‌.. ఐదేళ్ల మల్టిపుల్‌ ఎంట్రీ పర్యటక వీసా..!

భారత్‌తో బంధాన్ని బలోపేతం చేసేందుకు వీలుగా ప్రత్యేక వీసా విధానాన్ని దుబాయ్‌ (Dubai) అమల్లోకి తెచ్చింది.

Updated : 27 Feb 2024 13:49 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారతీయుల కోసం దుబాయ్‌ (Dubai) మల్టిపుల్‌ ఎంట్రీ ట్రావెల్‌ వీసాను ప్రవేశపెట్టింది. ఇటువంటి సౌకర్యాన్నే గల్ఫ్‌ దేశాలకు కూడా ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని దుబాయ్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎకానమీ అండ్‌ టూరిజం (డీఈటీ)ను ఉటంకిస్తూ ఆంగ్ల వార్తా సంస్థ పీటీఐ పేర్కొంది. 

గతేడాది దుబాయ్‌ను 2.46 మిలియన్ల మంది భారతీయులు సందర్శించారు. కొవిడ్‌-19 ముందునాటి పరిస్థితితో పోలిస్తే ఇది దాదాపు 25శాతం అధికం. గతేడాది భారత్‌ నుంచి 1.84 మిలియన్ల మంది పర్యటకులు ఆ దేశాన్ని సందర్శించారు. 2019లో ఈ సంఖ్య కేవలం 1.97 మిలియన్లు మాత్రమే. 

భారత్‌-బ్రిటన్‌ సముద్రగర్భ కమ్యూనికేషన్‌ కేబుల్‌పై హూతీల దాడి..!

ఈ సరికొత్త విధానం ద్వారా భారతీయులు పర్యటక వీసా ద్వారా దుబాయ్‌(Dubai)కు ఐదేళ్ల వ్యవధిలో పలు మార్లు వెళ్లి రావచ్చు. ఒక సారి వెళితే 90 రోజులపాటు అక్కడ ఉండి రావచ్చు. ఒక ఏడాదిలో మొత్తం 180 రోజులకు మించకుండా ఉండాలి. ఈ వీసా అప్లికేషన్‌ ప్రాసెస్‌ను కేవలం రెండు నుంచి ఐదు పనిదినాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఈ వీసాకు అర్హులైన వారు కచ్చితంగా కీలకమైన అంశాలను పాటించాలి. గత ఆరునెలల్లో బ్యాంక్‌ ఖాతాలో 4,000 డాలర్ల లేదా అంతకు సమానమైన విదేమారకద్రవ్యం ఉండాలి. యూఏఈలో చెల్లుబాటయ్యేలా ఆరోగ్య బీమా తప్పనిసరి. ‘‘దుబాయ్‌ ఐదేళ్ల మల్టిపుల్‌ వీసా ఎంట్రీని ప్రవేశపెట్టింది. సుస్థిర ఆర్థిక సహకారం కొనసాగేందుకు, వాణిజ్య, పర్యటకాన్ని  ప్రోత్సహించేందుకు దీనిని అమలు చేస్తున్నారు’’ అని డీఈటీ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు