WhatsApp: ప్రతి రాత్రి వాట్సప్‌ ‘డేటా ఎక్స్‌పోర్ట్’.. మస్క్‌ ఆరోపణలకు క్యాత్‌కార్ట్‌ కౌంటర్‌!

యూజర్‌ డేటాను ఎక్స్‌పోర్ట్‌ చేస్తుందంటూ టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) చేసిన ఆరోపణలను వాట్సప్‌ చీఫ్‌ విల్‌ క్యాత్‌కార్ట్‌ తోసిపుచ్చారు.

Published : 28 May 2024 14:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ మెసెంజర్‌ యాప్‌ వాట్సప్‌ (WhatsApp) ప్రతీ రాత్రి యూజర్‌ డేటాను ఎక్స్‌పోర్ట్‌ చేస్తుందంటూ టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) పేర్కొనడం చర్చనీయాంశమయ్యింది. వీటిని వాట్సప్‌ అధినేత విల్‌ క్యాత్‌కార్ట్‌ తోసిపుచ్చారు. ఆయన వాదన అవాస్తవమన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే ఎంతోమంది చెప్పారని, మళ్లీ పునరావృతం చేయడం వల్ల ఉపయోగం లేదన్నారు.

‘ప్రతీ రాత్రి మీ యూజర్‌ డేటాను వాట్సప్‌ ఎక్స్‌పోర్ట్‌ చేస్తుంది. అయినప్పటికీ అది సురక్షితమేనని కొంతమంది భావిస్తున్నారు’ అని ఎలాన్‌ మస్క్‌ తన ఎక్స్‌ ఖాతాలో పేర్కొన్నారు. దీనిపై వాట్సప్‌ అధినేత విల్‌ క్యాత్‌కార్ట్‌ దీటుగా స్పందిస్తూ.. ‘‘ఇప్పటికే చాలామంది ఇదే విషయాన్ని చెప్పారు. కానీ, దీన్నే పునరావృతం చేయడం వల్ల ఉపయోగం లేదు. భద్రత అంశాన్ని వాట్సప్‌ చాలా తీవ్రంగా పరిగణిస్తుంది. అందుకే మీ మెసేజ్‌లను ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్ట్‌ చేస్తాం. ప్రతీ రాత్రి అవి మాకు చేరవు లేదా ఎక్స్‌పోర్టు కావు. మీ మెసేజ్‌లను బ్యాకప్‌ చేయొద్దు అనుకుంటే, మీ క్లౌడ్‌ ప్రొవైడర్‌ను వినియోగించుకోవచ్చు. దానికి కూడా ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ ఉంటుంది’ అని వాట్సప్‌ చీఫ్‌ స్పష్టం చేశారు.

నాడు మిత్రుడి భార్యతో ఎలాన్‌ మస్క్‌ అఫైర్‌ నిజమే.. అమెరికాలో సంచలన కథనం

ట్విటర్‌ను కొనుగోలు చేసిన తర్వాత ప్రత్యర్థి సంస్థ ‘మెటా’పై ఎలాన్‌ మస్క్‌ విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో మస్క్‌, మార్క్‌ జూకర్‌బర్గ్‌ల మధ్య మాటల యుద్ధం కూడా కొనసాగింది. కేజ్‌ ఫైట్‌కూ సిద్ధమని ఇరువురూ సవాల్‌ విసురుకునే స్థాయికి వెళ్లింది. మస్క్‌ వెనుకంజ వేయడంతో తాను ఈ పోటీ నుంచి విరమించుకుంటున్నట్లు జూకర్‌బర్గ్‌ ప్రకటించారు. ఈ క్రమంలోనే మళ్లీ తన వాదనను మొదలుపెట్టిన మస్క్‌.. జూకర్‌తో ఎక్కడైనా, ఎప్పుడైనా పోటీకి సిద్ధమంటూ మళ్లీ ప్రకటనలు చేయడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని